ప్రభుత్వ పాఠశాలలు షట్ డౌన్.. సీఎం రేవంత్‌కు విద్యార్థుల బాధలు పట్టవా? : హరీశ్ రావు

-

తెలంగాణలో ప్రభుత్వ బడుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఓవైపు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నామని ప్రజాప్రతినిధులు, ఏకంగా ముఖ్యమంత్రి చెబుతున్నా క్షేత్రస్థాయలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గతంలో విద్యార్థులతో కలకలలాడిన ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉంటే టీచర్లు లేక.. టీచర్లు ఉంటే విద్యార్థులు లేక.. అరకొర వసతులతో దీనంగా దర్శనమిస్తున్నాయి. ఇక రెగ్యులర్,కాంట్రాక్ట్ గెస్టు లెక్చరర్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌ని ప్రశ్నించారు.

‘సారొస్తారా..! అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతున్నది.ఉపాధ్యాయులు లేక, విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు, బడికి దూరమవుతున్నరు. విద్యాశాఖను కూడా తానే నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు’ అని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల సమస్యలపై దృష్టిసారించి వాటికొక శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news