బ్రేకింగ్: హైదరాబాద్ మేయర్ ఈసారి మహిళే…!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల కమీషనర్ పార్ధసారధి ప్రకటించారు. డిసెంబర్ 1న పోలింగ్, 4న కౌంటింగ్ ఉంటుంది అన్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని చెప్పారు. నవంబర్ 20న నామినేషన్లకు చివరి రోజు అన్నారు. 22న పరిశీలన, అదే రోజు ఉపసంహరణకు అవకాశం, అభ్యర్థులు ఖరారు చేస్తామని, అవసరమైతే డిసెంబరు 3రీపోలింగ్ ఉంటుంది అన్నారు.

4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిస్తామని, ఈనెల 13న ఫైనల్ ఓటర్ లిస్ట్ ను విడుదల చేశాం అని చెప్పారు. వార్డుల డీలిమిటేషన్, రిజర్వేషన్లు ప్రక్రియ ప్రభుత్వ స్థాయలో జరిగిందని, మేయర్ స్థానం‌ జనరల్ మహిళకు కేటాయిస్తామని చెప్పారు. ఈఏడాది జనవరి 20న నాటికి 18ఏళ్ళు పూర్తిచేసుకున్న వారు ఓటును వినియోగించుకోవచ్చన్నారు. పోలీంగ్ స్టేషన్ల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు.