గ్రేటర్: బిజెపి సీటు ఇవ్వలేదని మహిళా నేత ఆత్మహత్య

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి నేతలు దూకుడుగా ఉన్నారు. గ్రేటర్ లో కచ్చితంగా విజయం సాధిస్తామని బిజెపి నేతలు చెప్తున్నారు. అయితే టికెట్ లు ఇచ్చే విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించడం లేదు. తాజాగా తనకు టికెట్ ఇవ్వలేదని ఒక మహిళా నేత ఆత్మహత్యాయత్నం చేసారు. నాచారం లో బీజేపీ నాయకురాలు విజయలత రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసారు.

బీజేపీ నుండి టికెట్ ఆశించిన విజయలత రెడ్డి… ఇతరులకు కేటాయించారని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసారు. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు కుటుంబసభ్యులు తరలించారు. తమని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తమకు టికెట్ రాకుండా మోసం చేసారని మనస్థాపం చెందారు ఆమె. గత గ్రేటర్ ఎన్నికలలో కూడా బీజేపీ నుండి పోటీ విజయలత రెడ్డి… ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు.