గుప్పెడంతమనసు ఎపిసోడ్ 291 : నాకు ఒక్కమాటైనా చెప్పకుండా ఆ శిరీష్ ని ఎందుకు పెళ్లిచేసుకుంటున్నావ్ అని వసూని అడిగేసిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ పుష్పానే ఆర్టికల్ రాసింది అనుకుని ఓ తెగ పొగుడుతుంటాడు. నీ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు, నాకు చూపించకుండానే పంపాశావ్ చూడు..ఇలానే ఉండాలి అని అవును ఆ పేపర్ వాళ్ల మెయిల్ ఐడీ ఎవరు ఇచ్చారు నీకు అంటే..అప్పుడు పుష్పా చెప్తుంది. ఆ ఆర్టికల్ నేను రాయలేదు అంటుంది. రిషీకి కోపం కట్టలుతెచ్చుకుంటి..నువ్వురాయలేదా..ఎవరు రాశారు అంటే..వసుధార రాసింది అని చెప్తుంది. నిన్ను రాయమంటే తనెందుకు రాసింది అని రిషీ అరుస్తాడు..నేనే రాయమని తనని ఫోర్స్ చేశాను సార్ అంటుంది. రిషీకి అంతా మీ ఇష్టమేనా, మీ ఇష్టారాజ్యంగా మీరు చేసుకుంటే పోతే నేను ఇక్కడ ఉండటమెందుకు అని అటెండర్ తో వసుధారను అర్జెంటుగా రమ్మని పిలిపిస్తాడు. నీకు చేతకాకపోతే నాకు చెప్పాలికానీ, ఆ వసుధారతో రాయించడమేంటి పుష్పా అంటాడు. ఇంతలో వసుధార వస్తుంది. రిషీకి కాల్తాఉంటుంది. రండి మేడమ్ రండి, వచ్చి నా సీట్ లో కుర్చోండి..అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, నిన్ను ఎవరు రాయమన్నారు అంటాడు.

ఇంతలో జగతి, మహేంద్రలు కూడా వచ్చి వెనుక నుల్చుంటారు. వసుధార నేను ఆర్టికల్ బాగానే రాశాను కదా అంటుంది. రిషీ షట్ అప్ వసుధార, అసలు నిన్ను ఎవరు రాయమన్నారు, నేను ఎందుకు ఉన్నట్లు ఇక్కడ, అంతా మీ ఇష్టమేనా..బాగానే రాసింది అంట బాగా అంటూ వసుధార మీద విరుచుకుపడతాడు..మహేంద్ర కల్పించుకుని తనేదో అని చెప్పబోతాడు..డాడీ ప్లీజ్ మధ్యలో మీరు రాకండి, నేను పుష్పకి చెప్పాను, తనెందుకు రాయాలి, ఎ‌వరు ఇష్టం వచ్చింది వాళ్లు చేస్తే నేనెందుకు నాకు ఈ సీట్ ఎందుకు, ఎంటి వసుధార నీ ధైర్యం, ఎంచేసినా నడుస్తుందనా. తనకుచెప్పాను తను రాస్తుంది, రాయలేకపోతే నేను రాసుకుంటాను, మధ్యలో నీదేంటి పెత్తనం, అసలు రాయటం, పేపర్ వాళ్లకి పంపటం అంతా నీ ఇష్టమేనా అంటాడు. జగతి నేనే రాయమన్నాను అని చెప్పబోతుంది..మేడమ్ మధ్యలో మీరు ఏం మాట్లాడకండి, మీరు రాయమంటే రాసేస్తుందా, నాకు ఒక మాట చెప్పరా, అయినా మీరెందుకు రాయమన్నారు అంటాడు. జగతి ఫ్యాకల్టీ హెడ్ గా అని చెప్పబోతుంది..ఫ్యాకల్టీ హెడ్ అయితే ఏంటి, నాకు హెడ్ కాదు కదా అంటాడు.

మహేంద్ర ఏంటి రిషీ ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావ్ అంటే..డాడ్ ప్లీజ్ గొడవ కాదు, ఏ తనకు మాత్రమే ఆత్మాభిమానం, ఆత్మగౌరవాలు ఉంటాయా,నాకు ఉండవా..అప్పుడెప్పుడో గొడవచేస్తే ప్రస్ వాళ్లను పిలుస్తానంది, మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు..ఒక పద్ధతి ఉండాలికదా, నాకు చెప్పాలి అని, నాకు అనుమతి తీసుకోవాలని నీకు అనిపించలేదా. మార్కులు రావటం ఒక్కటే కాదు..డిసిప్లీన్ ఉండాలి, హక్కులు, పద్దతులు అంటూ మాట్లాడుతావ్..ఆ రోజు ఛానల్ ఇంటర్వూ రోజు వెళ్లిపోయావ్ అంటూ వసుధార మీద ఏకధాటిగా డైలాగ్స్ వేస్తూనే ఉంటాడు. మధ్యలో సర్థిచెప్దామని మహేంద్ర ట్రై చేసినా వినడు..రిషీ ఏంటిది చిన్నవిషయాన్ని పట్టుకుని నువ్వింతిలా గొడవ చేస్తున్నావ్ అని మహేంద్ర అంటే..రిషీ గట్టిగా డాడ్ ఇది చిన్న విషయం కాదు, మన కాలేజ్ సిస్టమ్ ని వసుధార ధిక్కరించింది, ప్రశ్నించింద, అంతా నా ఇష్టం..నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదు వసుధార..డాడ్ ఇది చిన్నవిషయంలా మీకు అనిపిస్తుందేమో నాకు కాదు, నా మాటను కాదని నాకు చెప్పకుండా చేయటం కరెక్టు కాదు అని టేబుల్ మీద ఫైల్స్ విసిరిగొడతాడు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదు ఇక్కడ అని వెళ్లిపోతాడు. రిషీ బాధ వసుధార ఆర్టికల్ రాసింది అని కాదు..పెళ్లిని మనసులో పెట్టుకుని రిషీ ఇలా అరుస్తున్నాడు, అనవసరంగా రిషీ వసూల మధ్య దూరం పెంచుతున్నానా, తప్పంతా నాదేనా అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. అవును మరీ తప్పు చేసేది మహేంద్ర, ఇగో మాష్టర్ అంత ఈజీగా బయటపడతాడని ఎలా అనుకున్నాడు అసలు..ఊరికే వారం నుంచి ఇదే లైన్ తీసుకుని లాగుతున్నారు.

ఆరోజు రాత్రి రిషీ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు. శిరీష్ వచ్చి పర్మిషన్ అడిగింది, పొద్దున వసుధారను తిట్టింది ఆలోచిస్తాడు. ఇక్కడ వసుధార కూడా రిషీ సర్ మీకు ఏమైంది, నేను చేసిన తప్పేంటి అని అంటుంది. ఈ సీన్ ఏదో వాళ్లిద్దరు పక్కపక్కనే ఉన్నట్లు చూపిస్తారు. కానీ ఎవరికి వాళ్లు మాట్లాడుకుంటారు. సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావ్ వసుధార, నీకు పెళ్లని నాకు ఒక మాట చెప్పాలనిపించలేదా అని రిషీ అంటాడు. వసూ రిషీ సార్ సడన్ గా మీలో ఏదో మార్పు వచ్చింది, ఒకప్పటి మీరు మీరులా లేరు సార్ అంటుంది. ఇక్కడ రిషీ ఒకప్పుడు నేను నాలా ఉండేవాడ్ని, నాలో ఈ సున్నితత్వం ఏం ఉండేవికావు అంటాడు. రిషీ వసుధార మీద కోపం మీద నిజంగానే కోపమా, లేక తెచ్చిపెట్టుకున్న కోపమా అని తనలో తానే ప్రశించుకుంటాడు. ఇలా వీళ్లిద్దరు ఎవరికివాళ్లు వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటాు. బయట ఇలా చేస్తే పిచ్చోళ్లు అంటారు కూడా. వీళ్ల మనోవిశ్లేషణ సీన్ బాగా ల్యాగ్ చేస్తారు. మొత్తానికి ఇద్దరూ ఒకేసారి ఫోన్ చేయాలా అనుకుంటారు. వసుధార వద్దులే అనుకుంటుంది. రిషీ కూడా అవసరమా అని చేయడు.

వసూ అలా డల్ గా రూంలో కుర్చుంటుంది. జగతి వస్తుంది ఏంటి వసూ డల్ గా ఉన్నావ్, ఆర్టికల్ గురించా, వద్దన్న పని చేసినందుకు రిషీకి కోపం వచ్చింది ఏదో అన్నాడు అయిపోయింది, భోజనం చేయకుండా ఉంటావా లే భోజనం చేద్దాం అంటుంది. వసుధార నాకు ఆకలిగా లేదు అంటుంది. జగతి నాలుగు మంచిమాటలు చెప్తుంది. కొన్ని వదిలేయాలి, కొన్ని పట్టుకోవాలి అంటూ అయినా వసూ నాకు ఆకలిగా లేదు అంటే…సరే ఫ్రూడ్స్ ఏమైనా తింటావా అని ఫ్రూడ్స్ తేవటానికి వెళ్తుంది.

ఇక్కడ రిషీ కూడా హల్ ఒంటరిగా కుర్చుంటాడు. మహేంద్ర వచ్చి పలకరించి అనవసరంగా అన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు నాన్న అంటాడు. అన్నీ అంటే ఏంటి అంటాడు రిషీ. పొద్దున్న జరిగిన సీన్ గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు.. ఈగోకు తీసుకుని అనవసరంగా తనను తిట్టారేమో అనిపించింది..ఈ మాత్రం అడిగే స్వాతంత్రం కూడా నాకు లేదా చెప్పు..ఇక్కడ సమస్య ఆర్టికల్ కాదు, నీ మనసులో ఇంకేదో ఉందేమో అనిపిస్తుంది అంటాడు మహేంద్ర. నా మనసులో ఇంకేం లేదు డాడ్, శిరీష్, వసుధార, కాలేజ్ కాకుండా ఇంకేదైనా టాపిక్ ఉంటే చెప్పండి డాడ్ అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో ఉంది అసలైన ట్విస్ట్..రిషీ వసూ కారులో వెళ్తూ..ఆ శిరీష్ ని పెళ్లిచేసుకుంటున్నా అని నాకు ఒక్కమాటైనా చెప్పావా అని వసూ చేయి పట్టుకుని రిషీ అడుగుతాడు. వసూ షాకై అలానే చూస్తుంది. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలని నీకు ఎన్ని సార్లు చెప్పాను..నువ్వు నాకు ఒక్కమాటైన చెప్పుకుండా ఆ శిరీష్ ని పెళ్లిచేసుకుంటున్నావా, ఎందుకు అని అడుగుతాడు. చూడాలి రేపు ఇది నిజమా లేక మనోడి కలా అని.. నిజమైతే ఈ సస్పెన్స్ కి తెరపడినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news