వినండ‌హో…. ష్.. ఏపీలో బీజేపీదే అధికారం..!

-

వినేవాడు ఉండాలే కానీ, రాజ‌కీయ నేత‌లు చెప్పే మాట‌లు కోట‌లు దాట‌తాయి. తాజాగా బీజేపీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స్యభ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు నోటి నుంచి వ‌చ్చిన ప‌లుకులు సినీ డైలాగుల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. భ‌విష్య‌త్తుపై ఆశ‌లు ఉండాల్సిందే. భ‌విష్య‌త్తుపై క‌ల‌లు క‌నాల్సిందే. కానీ, వాటికీ ఓ హ‌ద్దుంది. కానీ, జీవీఎల్ వ్యాఖ్య‌లు వింటుంటే.. మాత్రం ఆ క‌ల‌ల‌కు, ఆశ‌ల‌కు హ‌ద్దు ప‌ద్దు లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఏపీ మీడియాతో మాట్లాడిన జీవీఎల్‌.. చాలా ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లే చేశారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగానే కాకుండా సామాన్యుల్లోనూ సంచ‌లనం రేకెత్తించాయి.


వైసీపీ, టీడీపీలను ప్రజలు ఎక్కువ కాలం ఆదరించే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రత్యామ్నా య శక్తిగా, జాతీయ పార్టీగా బీజేపీ మాత్రమే కనిపిస్తోందని తెలిపారు. ఏపీలో ఏ పరిణామం ఎప్పుడు జరుగు తుందో చెప్పలేమన్నారు. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం ప్రజల్లో ఉందని తెలిపారు. చం ద్రబాబు రాజకీయ భవిష్యత్తు అంధకారమైందని తెలిపారు. చిదంబరం, శివకుమార్‌ వంటి వారి పరిస్థితి చూసి చంద్రబాబు కూడా భయపడుతున్నట్లుందని వ్యాఖ్యానించారు. టీడీపీతో మరోసారి స్నేహం చేయాల్సిన అవసరం తమకు లేనేలేదని స్పష్టం చేశారు.

అయితే, అంత‌టితో జీవీఎల్ ఆగ‌లేదు… టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమైనట్టుగానే… చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే నేనే మధ్యవర్తిత్వం వహిస్తా అని జీవీఎల్‌ పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ సొంతంగానే ఎదుగుతుంది. చంద్రబాబును రెండుసార్లు సీఎం చేసింది బీజేపీయే. ఆయన అధికారంలో ఉండగానే తప్పులు జరుగుతున్నాయని చెప్పామ‌న్న జీవీఎల్‌.. రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేమంటూ.. న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడం చాలా సులువని జీవీఎల్‌ తెలిపారు.

కుట్రలు, కుల, మత, ప్రాంత రాజకీయాలు కాకుండా నైతిక విలువలు ఉన్న రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి, బలపడతామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాత రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఇతర పార్టీల్లో ఓడిపోయిన నేతలు వచ్చినంత మాత్రాన పార్టీ అభివృద్ధి చెందదని… అలాంటి వారు సొంత భవిష్యత్తు కోసమే బీజేపీలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. జీవీఎల్ వ్యాఖ్య‌లు.. ఆశ‌యాల‌కు ఎక్కువ‌గా అంచ‌నాల‌కు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news