హస్తంలో వింతలు..ఇలా ఉందేంటి గురు!

-

తెలంగాణలో అన్నీ పార్టీలది ఒక దారి అయితే..కాంగ్రెస్ పార్టీది ఒక దారి…మొదట నుంచి ఆ పార్టీ పరిస్తితి ఏంటో క్లారిటీ ఉండదు..కాసేపు ఆ పార్టీ పరిస్తితి బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది…మళ్ళీ ఏదో తేడా కొట్టేసినట్లు ఉంటుంది…కాంగ్రెస్ నేతలు వారి వారే గొడవపడతారు..అలాగే టీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అవుతారు…అసలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో వింత రాజకీయం ఉంటుందని చెప్పొచ్చు.

అయితే మొదట నుంచి కాంగ్రెస్ లో సొంత పోరు ఎక్కువ..నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ…ఎవరికి వారు తోపులు అనుకుంటారు. అలాగే వారిలో వారే..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు..అయ్యో ఇలా తిట్టుకుంటున్నారు ఏంటి..అనే లోపే కలిసిపోతారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్తితి ఉంది. ఓ వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి…మరో వైపు టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ నేతల విమర్శలు ఆగవు.

ఇంత జరుగుతున్నా సరే కాంగ్రెస్ లోకి వలసలు ఎక్కువ నడుస్తున్నాయి…ఏందో ఎవరికి కాకుండా ఉంటుంది కాంగ్రెస్ రాజకీయం. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, జగ్గారెడ్డికి పడటం లేదనే సంగతి తెలిసిందే..జగ్గారెడ్డి కోపం వచిన్నప్పుడల్లా మీడియాకొచ్చి రేవంత్ రెడ్డిని తిడతారు. మళ్ళీ వెంటనే నో కామెంట్ అంటారు..జగ్గారెడ్డి గురించి రేవంత్ ని అడిగితే…జగ్గారెడ్డి మా అన్న అంటారు. ఇటీవల ఏదో సంచలన ప్రకటన చేస్తానని చెప్పి జగ్గారెడ్డి తర్వాత చల్లబడ్డారు. ఈ కథ ఇలా నడుస్తుండగానే..విష్ణువర్ధన్ రెడ్డి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. తన సోదరి విజయా రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన అలిగారు. ఇక ఆయన అలకని తీర్చడానికి కొందరు కాంగ్రెస్ నేతలు..లంచ్ మీటింగ్ పెట్టుకున్నారు. మరో వైపు ఏమో రేవంత్ రెడ్డి..టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులని వరుసపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటూ వస్తున్నారు. భట్టిని పట్టుకుని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో నేతలకు కండువాలు కప్పిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ లో రకరకాల వింత పరిస్తితులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news