ఈ తెలుగు హీరోయిన్‌ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? ఇప్పుడు ఎంపీ అయి పార్ల‌మెంట్‌కు వెళ్తోంది..!

-

మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన న‌వ‌నీత్ కౌర్ 36,951 ఓట్ల మెజారిటీతో శివ‌సేన ఎంపీ అభ్య‌ర్థి, 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆనంద్‌రావు అద్సుల్‌ను ఓడించింది.

సినిమాలు.. రాజ‌కీయాలు.. దాదాపుగా ఒక్కటే.. అందులో వెండితెర‌పై న‌టులు న‌టిస్తారు. ఇందులో రాజకీయ తెరపై నాయ‌కులు న‌టిస్తారు. కాక‌పోతే కొన్ని సార్లు సినీ న‌టులు రాజ‌కీయ నేత‌లు అవుతుంటారు. అంతే తేడా. ఈ క్ర‌మంలోనే రెండు తెర‌ల‌పై స‌క్సెస్ అయ్యే వారు అతి త‌క్కువ మందే ఉంటారు. వారిలో న‌టి న‌వ‌నీత్ కౌర్ కూడా ఒక‌రు. ఆమె ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇప్పుడు ఎంపీ అయి పార్ల‌మెంట్ గ‌డ‌ప తొక్క‌నుంది.

న‌వ‌నీత్ కౌర్ తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో చాలా కాలం పాటు ఉంది. ఆమె ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొంది. శ్రీను వాసంతి ల‌క్ష్మి, జ‌గ‌ప‌తి, రూమ్ మేట్స్‌, మ‌హార‌థి, య‌మ‌దొంగ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. ఆ తరువాత ఆమె సినిమాల‌కు గుడ్‌బై చెప్పి మ‌హారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే ర‌వి రాణాను పెళ్లి చేసుకుంది. ఈ క్ర‌మంలోనే 2014లో మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్‌సీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయింది. ఇక ఇప్పుడు కూడా అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందింది.

మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన న‌వ‌నీత్ కౌర్ 36,951 ఓట్ల మెజారిటీతో శివ‌సేన ఎంపీ అభ్య‌ర్థి, 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆనంద్‌రావు అద్సుల్‌ను ఓడించింది. ఈ క్ర‌మంలో న‌వ‌నీత్ కౌర్ ఇప్పుడు ఎంపీగా తొలిసారి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్ట‌నుంది. ఏది ఏమైనా.. సినిమాల్లో న‌టించినంత తేలిక కాదు.. రాజ‌కీయాల్లో ఉండ‌డం అంటే.. అయినా అటు సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ రాణించిన కొంద‌రిలో న‌వ‌నీత్ కౌర్ ఒక‌రు. మ‌రి ఎంపీగా ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news