జార్ఖండ్ లో ఎవరికి ఎన్ని సీట్లు…? హీరో మాత్రం ఆయనే…!

-

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగు లేని విజయం సాధించిన బిజెపికి చుక్కలు కనపడ్డాయి. ఇన్నాళ్ళు తమదే అధికారమని భావించిన భారతీయ జనతా పార్టీకి ఒక్కో రాష్ట్రం ఊహించని విధంగా షాక్ లు ఇస్తుంది. తమ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో కూడా గెలవలేక బిజెపి నానా కష్టాలు పడుతుంది. హర్యానాలో చచ్చీ చెడీ అధికారం ఏర్పాటు చేసిన బిజెపి, మహారాష్ట్రలో అధికారం చేపట్టలేకపోయింది. తాజాగా అధికారం ఉన్న జార్ఖండ్ ని బిజెపి కోల్పోయింది.

2015 ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో 81 స్థానాలకు గానూ 37 స్థానాల్లో విజయం సాధించిన, అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ… ఏజేఎస్‌యూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా ఫలితాల్లో 24 స్థానాలకే కమలాన్ని ఆ రాష్ట్ర ఓటర్లు కట్టడి చేసారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేఎంఎం-ఆర్జేడీ కూటమి మెజార్టీ మార్క్‌ను దాటి 47 స్థానాల్లో విజయం సాధించింది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

జార్ఖండ్ లో అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసారు. దాదాపు వందకు పైగా సభల్లో ఇద్దరు పాల్గొన్నారు. అయినా సరే కమలం పార్టీని అక్కడి ప్రజలు ఎంత మాత్రం ఆదరించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బిజెపి ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తేసింది. ముఖ్యమంత్రి స్వతంత్ర అభ్యర్ధి చేతిలో ఓడిపోవడం అనేది నిజంగా బిజెపికి ఆందోళన కలిగించే అంశం.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో హీరో మాత్రం ఒక్కరే. ఆయన హేమంత్ సోరెన్. హేమంత్‌ సొరెన్‌ జార్ఖండ్‌ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. రెండు నియోజకవర్గాలు- దుమ్కా, బార్హట్‌ ల నుంచి బరిలో దిగి రెండింటిలోనూ ఆయన విజయం సాధించారు. 2013-14లో 17 నెలల పాటు సీఎంగా పని చేసిన ఆయన… 38 ఏళ్ళకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి రికార్డ్ సృష్టించారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత, రెండు సార్లు సిఎం అయిన శిబూ సోరెన్ కుమారుడే హేమంత్ సోరెన్. భిన్నంగా ప్రజల్లోకి వెళ్ళడం, దళిత వర్గాలలోకి పార్టీని తీసుకువెళ్ళడం ఆయనకు కలిసి వచ్చిన అంశం.

మొత్తం సీట్లు 81
మేజిక్‌ ఫిగర్‌ 41
జేఎంఎం+కాంగ్రె్‌స+ఆర్జేడీ 47
బీజేపీ 25
ఏజే ఎస్ యు 2
జేవీఎం 3
స్వతంత్రులు 4

Read more RELATED
Recommended to you

Latest news