హై కోర్టులో దాగుడు మూతలు.. ఇంతకీ కేసీఆర్ మనసులో ఏముంది?

-

ఏదో ఒకటి చెప్పండి. రేపటితో కర్ఫ్యూ అయిపోతుంది. ఎందుకు ఈ దాగుడు మూతలు ఆడుతున్నారు. అసలు నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తరా లేదా లాక్ డౌన్ పెడుతరా? ఏదో ఒకటి చెప్పకుండా ఎందుకు నాన్చుతున్నారు? అని హై కోర్టు దుమ్ముదులుపుతోంది. ఈ రోజు హై కోర్టులో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, కర్ఫ్యూ అమలు గురించి హై కోర్టు విచారణ జరిపింది. ఏప్రిల్ 30తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందనే దానిపై హైకోర్టు ప్రశ్నించింది.

 

అయితే దీనిపై ప్రభుత్వం నుంచి పెద్దగా ఆన్సర్ రాలేదు. రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఏజీ బీఎస్ ప్రసాద్ వెల్లడించారు. అంటే రేపు రాత్రి వరకు ఏ విషయం చెప్పలేమని ఇన్ డైరెక్ట్ గా ఆయన వెల్లడించారు. అదేదో ఒక రోజు ముందు చెబితే నష్టమేంటని ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకని ప్రశ్నించింది. ఎస్ఈసీ అధికారులు భూమిపై ఉన్నారా? లేక ఆకాశంలోనా ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికలు మే3 ఫలితాలతో ముగుస్తాయి. ఆ తర్వాత లాక్ డౌన్ పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదనేది కేసీఆర్ టీం ఆలోచనగా కనిపిస్తోంది. అప్పటి వరకు అవసరమైతే నైట్ కర్ఫ్యూను పొడిగించే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా తెలుపట్లేదని సమాచారం. ఇక నిన్న రాత్రి హోం మంత్రి మహమూద్ అలా కూడా ఇదే విషయమై డీజీపీతో సమీక్ష నిర్వహించారని తెలుస్తోంది. ఏదైనా రేపు ఒక నిర్ణయం మాత్రం తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news