బ్రేకింగ్: తెలంగాణా సర్కార్ ని ఉతికి ఆరేసిన హైకోర్ట్

-

తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూతో కేసులు తగ్గాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్ట్ ఆదేశించింది. తెలంగాణా సర్కార్ చర్యలపై మండిపడింది. కుంభమేళా నుంచి వచ్చిన వారు అందరికి అన్ని రాష్ట్రాలు క్వారంటైన్ చేస్తున్నాయని తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని హైకోర్ట్ ప్రశ్నించింది.

మూడు రోజుల్లోనే ఆక్సీజన్ కొరత ఏ విధంగా వచ్చిందని నిలదీసింది. స్మశాన వాటికలో రోజుకి ఎంతమందికి అంత్యక్రియలు జరుపుతున్నారో వివరాలు ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించింది. ప్రతీ హాస్పిటల్ లో డిశ్ ప్లే బోర్డ్ లు ఎందుకు చూపించడం లేదని నిలదీసింది. వెబ్ పోర్టల్ లో బెడ్స్ ఆక్సీజన్ వివరాలు ఎందుకు ఉంచడం లేదని మండిపడింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్ట్ నిలదీసింది.

Read more RELATED
Recommended to you

Latest news