హైదరాబాద్‌కు కవిత.. 500 కార్లతో భారీ ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌కు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ముందు ట్రయల్ కోర్టు విచారణ కోసం వర్చువల్‌గా ఉదయం 11 గంటల తర్వాత కవిత హాజరుకానున్నారు.

కోర్టులో ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక టీఆర్ఎస్ భవన్ నుంచి మధ్సాహ్నం 12.15 గంటలకు కవిత ఎయిర్ పోర్టుకు బయలుదేరనున్నారు. ఆ తర్వాత 2.30 గంటల ఫ్లైట్‌కు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కవిత బయలు దేరి రానున్నారు. తమ అభిమాన నేత కేసీఆర్ కూతురు కవిత మూడు నెలల తర్వాత తిరిగి స్వరాష్ట్రానికి వస్తుండటంతో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతల ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 500 కార్లతో భారీ ర్యాలీ తీయనున్నట్లు సమాచారం.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత తిహార్ జైలులో మూడు నెలలకు పైగా శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news