పల్లవి  IAS .. ఎంతపని చేశావమ్మా .. !

-

బాధ్యతగల పదవిలో ఉన్నా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ ని అరికట్టాలని ప్రభుత్వాలు నానా కఠినమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తుంటే, బాధ్యతారహితంగా కొంతమంది అధికారులు చేస్తున్న పనులు మొత్తం సమాజాన్ని డేంజర్ జోన్ లో పడేస్తున్నాయి. కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో ఖమ్మం జిల్లా కి చెందిన ఒక పోలీస్ అధికారి తన కొడుకు విదేశాలనుండి వచ్చిన టైములో రిసీవ్ చేసుకుందామని విమానాశ్రయంలోకి వెళ్లగా కొడుకుకి పాజిటివ్ కేస్ అని తేలింది. అయితే తన పరపతిని ఉపయోగించి కొడుకుని క్వారెంటైన్ చేయించకుండా ఎయిర్ పోర్ట్ నుండి బయటకు తెచ్చాడు. అంతేకాకుండా ఒక ఫంక్షన్ కి తీసుకెళ్లి అనేకమందికి వైరస్ సోకేలా వ్యవహరించారు. దీంతో మొత్తం విషయం బయటపడటంతో తెలంగాణ ప్రభుత్వం సదరు పోలీసు అధికారి ని సస్పెండ్ చేయడం జరిగింది.Madhyapradesh IAS Dr Pallavi Jain Govil Tests CoronaVirus Positiveతాజాగా ఇదే విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పల్లవి అనే ఐఏఎస్ అధికారి ఈ విధంగానే వ్యవహరించింది. తన కుమారుడు ఇటీవల విదేశాల నుండి తీసుకు వచ్చింది. కుమారుడు విదేశాల నుండి వచ్చిన విషయాన్ని దాచి పెట్టింది. కుమారుడికి ఎటువంటి టెస్టులు చేయకపోవడంతో కరోనా వైరస్ బయటపడి…కుమారుడు నుండి ఆమెకు సోకింది. మధ్యప్రదేశ్ లో జైన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఈమె తనతో పాటు పనిచేసే సహచర ఉద్యోగులకు 36 మందికి వైరస్ అంటించింది. తాజాగా ఈ విషయం బయటపడింది,  వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది.

 

ప్రస్తుతం పల్లవి అనే ఈ ఐఎఎస్ అధికారిణి ఇంట్లోనే ఉంచి ఆమెకు ఆమె కుమారుడికి వైద్యాధికారులు చికిత్స చేస్తున్నారు. అతి మూర్ఖంగా ప్రవర్తించిన ఐఏఎస్ అధికారిని పనికి సహచర అధికారులు కూడా బలి అయిపోవటంతో వాళ్ల కుటుంబ సభ్యులంతా ఆ ఐఏఎస్ అధికారి పై మండిపడుతున్నారు. ఎంతపని చేశావమ్మా…నువ్వు ప్రమాదంలో పడి మా కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలో పడేసావు అంటూ సీరియస్ అయ్యారు. బాధ్యతగల పదవిలో ఉన్న అధికారులు ఈ విధంగా చేస్తే సామాన్యులు ఇంకెలా వ్యవహరిస్తారు అంటూ మరి కొంతమంది ఈ వార్తపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం చెందుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news