ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఈ నేపధ్యంలోనే ఆయన అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన రాజమండ్రి సహా అనేక ప్రాంతాలకు వెళ్ళిన చంద్రబాబు రాయలసీమలో కూడా పర్యటిస్తున్నారు. తిరుపతిలో ఆయన పర్యటనకు విశిష్ట స్పందన వచ్చింది.
ఇక గుంటూరు జిల్లా నరసరావు పేటలో కూడా చంద్రబాబు నాయుడు పర్యటనకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన చేపట్టిన జోలె కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తుంది. రాష్ట్రం మొత్తం విస్తరించాలి అనే ఆలోచనలో భాగంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలకు జనం నుంచి వస్తున్న స్పందనతో తెలుగుదేశం కార్యకర్తలు నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమలో మూడు రాజధానుల నిర్ణయాన్ని,
అక్కడి ప్రజలు స్వాగతిస్తారు అని అధికార వైసీపీ చేసిన వ్యాఖ్యలు నిజం కాదని చంద్రబాబు తిరుపతి పర్యటనతో తేలిపోయింది. వాస్తవానికి రాయలసీమ వాసులకు ఉత్తరాంధ్ర చాలా దూరం. చాలా ప్రాంతాల నుంచి బస్ సౌకర్యం లేదు. దీనితో వాళ్ళు అమరావతికే మొగ్గు చూపిస్తారు. అందుకే చంద్రబాబు ముందు రాయలసీమ సహా ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి ఈ ఉద్యమానికి సహకారం తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయితే జగన్ కు ఇబ్బందే అని పలువురు అంటున్నారు.