చంద్ర‌బాబు గెలిస్తే.. రాష్ట్రం నుంచి వెళ్లిపోతా : కొడాలి నాని సంచ‌ల‌నం

టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు సీఎంగా గెలిస్తే.. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని స‌వాల్ విసిరారు. చంద్ర‌బాబుకు ఇక గెలిచే సత్త లేద‌ని ఎద్ద‌వా చేశాడు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి గా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌ద్దె దించి.. చంద్ర‌బాబు నాయుడు కూర్చోంటే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డ‌మే కాకుండా రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోతాన‌ని మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఏపీ ముఖ్య మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఓడించ‌లేక పోతే చంద్ర‌బాబు ఎక్క‌డికి పోతాడ‌ని ప్ర‌శ్నించాడు. అలాగే సొంత ఊరిలోనే ఉంటావా అని స‌వాల్ విసిరారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లో వ‌స్తున్న ప్ర‌తి ఎన్నిక‌ల్లో చంద్ర బాబు దారుణంగా ఓడిపోతున్నాడ‌ని అన్నారు. అంతే కాకుండా ఆంధ్ర ప్ర‌దేశ్ కు ప‌ట్టిన శ‌ని, వైర‌స్ చంద్ర బాబు అని అంటూ ఘాటుగా విమ‌ర్శించారు. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఎప్పుడూ రాజ‌కీయ వేడి ఉంటుంది. అయితే తాజా గా మంత్రి కొడాలి నాని చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ఇంకా వేడి పెంచాయి.