జగన్‌… వైసీపీ నేతలతో జాగ్రత్తగా ఉండు : ఆర్జీవీ హెచ్చరిక

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ పెద్దల మధ్య వివాదం చెలరేగుతోంది. సినిమా టికెట్ల ధరలను పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై సినీ పెద్దలు డిమాండ్‌ చేస్తూంటే..జగన్‌ సర్కార్‌ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. ఈ వివాదంపై ఎప్పుడూ లేని విధంగా.. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా… జగన్‌ సర్కార్‌ పై ఓ రేంజ్‌ రెచ్చి పోతున్నారు. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంచలన ట్వీట్‌ చేశాడు.

వైసీపీ నేతలతో… చాలా జాగ్రత్తగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఉండాలని సూచలను చేశారు వర్మ. ”వైసీపీ పార్టీలో ఒక జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే చాలా గౌరవం, ప్రేమ. వైసీపీ నేతల్లో…. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా మంచి లీడర్‌. కానీ ఆయన పార్టీలో ఉన్న కొంత మంది లీడర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్‌ ను ఆ లీడర్లు… తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ల వ్యక్తిగత విషయాల కోసం జగన్‌ ను తప్పుదారి పట్టిస్తున్నారు. వారితో చాలా జాగ్రత్తగా జగన్‌ ఉండాలి. వారిని దూరం పెట్టాలి” అంటూ వర్మ సంచలన పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది.