ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ఇస్తే గాంధీభ‌వ‌న్‌కు కూడా రానివ్వ‌డు.. వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో పీసీసీ చీఫ్ ప‌ద‌విపై ఎలాంటి రాజ‌కీయాలు ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప‌ద‌వి కోసం పెద్ద రాజ‌కీయాలే న‌డుస్తున్నాయి. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి త‌ర్వాత ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో అయితే నేనంటే నేనంటూ అంద‌రూ టీప‌డుతున్నారు. ఇక ఈ ప‌ద‌వి రేవంత్‌కే వ‌స్తుందంటూ మ‌రోసారి వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఈ వార్త‌ల‌పై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తాను రేవంత్‌ను తిట్ట‌లేద‌ని, కానీ ఆయ‌న‌కు ఇస్తే చాలా దారుణాలు జ‌రుగుతాయ‌న్నారు. ఇక‌వేళ రేవంత్ పీసీసీ చీఫ్ అయితే గాంధీభవన్‌కు కూడా కాంగ్రెస్ నేత‌ల‌ను ఎవ‌ర్నీ రానివ్వడని హ‌నుమంత‌రావు ఆరోపించారు.

ఇప్ప‌టికే రేవంత్ చాలా కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడ‌ని, ఒక‌వేళ ఆయ‌న జైలుకు పోతే.. జైలు చుట్టూ కాంగ్రెస్ నేత‌లు తిరగాలా అంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పీసీసీ ఇస్తే ఎలా ఊరుకుంటామని, ఈ విష‌యంపై అధిష్టానాన్ని నిలదీస్తామ‌ని ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న వారికి అవాకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వీహెచ్ వ్యాఖ్యలు ఇప్పుడు టీకాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి.