అలాంటి ప్యాకేజీ ఇండియా లో వస్తే .. మనందరం కడుపు నిండా తినగలం  !

-

కరోనా వైరస్ ప్రభావం అమెరికన్ రాష్ట్రంలో చాలా భయంకరంగా ఉంది. దాదాపు 80 వేలకు పైగానే పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదవుతున్నాయి. దీంతో అమెరికా మొత్తం షట్ డౌన్ చెయ్యాలని భావిస్తున్నా గాని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దానికి సిద్ధంగా లేరు. అయితే వైరస్ ఎక్కువగా ఏ ఏ రాష్ట్రాల్లో ఉండటం జరిగిందో ఆ రాష్ట్రాలను లాక్ డౌన్ చేసేసారు. దీంతో చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. చాలా వ్యాపార సంస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఒకవేళ అమెరికానే షట్ డౌన్ చేయాల్సి వస్తే కనుక కచ్చితంగా అమెరికా ఆర్ధిక రంగం పూర్తిగా కనుమరుగై పోతుంది కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. Coronavirus: Trump acknowledges U.S. 'may be' headed to recessionమరోపక్క ఉద్యోగస్తూలు ఇళ్లకే పరిమితం కావటంతో వ్యాపార సంస్థల దెబ్బతినటం, ఉపాధి కోల్పోవడంతో వాదన ఆదుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ రెండు ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపుగా మన రూపాయల్లో 150 లక్షల కోట్లు ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీలో 367 బిలియన్ డాలర్లు చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేటాయించారు. అదేవిధంగా బడా వ్యాపార సంస్థలకు బాడీ సాయం ప్రకటించారు. దాదాపు 500 బిలియన్ డాలర్లు పోతున్నట్లు తెలిపారు.

 

ఇదే టైమ్ లో ఎయిర్ లైన్స్ మరియు వైద్య రంగానికి కూడా ప్యాకేజీ ప్రకటించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి నాయకులు మన దేశంలో ఉంటే బాగుండేది అని డోనాల్డ్ ట్రంప్ ని ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్యాకేజీలో అమెరికా యువకులకు నేరుగా డబ్బులు ఇవ్వడం కూడా ఉండటంతో…అదే ప్యాకేజీ ఇండియాలో వస్తే మనందరం కడుపునిండా తినగలం అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news