త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వే : మంత్రి నారాయణ

-

త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వే నిర్వహించనున్నట్టు ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరదల నేపథ్యంలో కాలువలు, డ్రైన్ల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు.  చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. కాలువలు, డ్రెయిన్ల ఆధునికీకరణకు చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించనున్నాం.

వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు ఎన్యూమరేషన్ చేస్తున్నాయి. అవసరమైతే మరిన్ని బృందాలను పెట్టి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఎవరైనా ఇళ్ల వద్ద లేకపోతే వారు తిరిగి వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ చేస్తామని తెలిపారు. రేపటికి పూర్తి స్థాయిలో నీరు వెల్లిపోతుందని వెల్లడించారు. విజయవాడలో దాదాపు 3వేల మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 10వేల మంది శానిటేషన్ పనుల్లో ఉన్నట్టు తెలిపారు. ఆహార సరఫరా కూడా సక్రమంగా జరిగిందని.. కేవలం కృష్ణా నుంచి కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా ఫుడ్ ఫ్యాకెట్స్ వచ్చాయని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version