ద‌మ్ముంటే త‌మ తో ఢిల్లీ లో ధ‌ర్నా చేయండి – వీహ‌చ్

హైద‌రాబాద్ లో మాట‌లు కాదు ద‌మ్ముంటే త‌మ తో ఢిల్లీ ధ‌ర్నా చేయాల‌ని ముఖ్య మంత్రి కేసీఆర్ కు, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు కాంగ్రెస్ నేత వి. హ‌నుమంత రావు స‌వాల్ విసిరాడు. రాష్ట్రం లో ప్ర‌జ‌లు ఓటు వేసింది కేసీఆర్ కు అని అన్నాడు. కానీ కేసీఆర్ వ‌రి ధాన్యం విష‌యం లో బీజేపీ వాళ్ల మీద‌కు నెడుతున్నాడ‌ని అన్నారు. ధాన్యం కుప్ప‌ల మీదే రైతుల గుండెలు ఆగుతున్న కేసీఆర్ లో చ‌ల‌నం రావ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

త‌క్ష‌ణ‌మే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశాడు. అలాగే కేసీఆర్ కు బండి సంజ‌య్ కు ద‌మ్ము ఉంటే త‌మ తో ఢిల్లీ లో ధ‌ర్నా చేయాల‌ని స‌వాల్ విస‌రాడు అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం పై నిప్పులు చేరిగాడు. కోట్లు ఖ‌ర్చు చేసి ప్రాజెక్టులు క‌ట్టి పంటకు నీళ్ళు ఇచ్చి ఇప్పుడు వ‌రి కొన అంటే ఎమిటి అని ప్ర‌శ్నించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లను కొన్నే దాని మీద దృష్టి.. పంటల కొనుగోలు మీద లేదని ఆరోపించారు.