రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అదేవిధంగా దక్షిణాది మీడియా రంగంలో ప్రముఖ ఛానల్ అతిపెద్ద మీడియా సంస్థ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఆ సంస్థలో పని చేస్తున్న వారు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మేటర్ లోకి వెళ్తే ప్రముఖ ఛానల్ లో కొత్తగా జాయిన్ అయిన ట్రైనింగ్ మహిళా జర్నలిస్టుల పై ఆ సంస్థకు చెందిన పెద్దలు లైంగిక వేధింపులు చేస్తున్నారని ట్రైనింగ్ సమయంలో ఉన్న మహిళలపై అవకాశాలు అనే వల వేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ సంస్థలో జాయిన్ అయినా మహిళా జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు.
ఆ సంస్థకు చెందిన పెద్దలు ట్రైనింగ్ సమయంలో ఎక్కడపడితే అక్కడ తాకడం, బయట కలుద్దామని ఒత్తిడి చేయడం.. అర్థరాత్రిళ్లు కూడా వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపడం.. నేరుగా ఇంటికే వచ్చేయడం వంటి చేష్టలకు ట్రైనింగ్ సమయంలో పెద్దలు చేస్తున్నారని మహిళా ట్రైనింగ్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు.
ట్రైనింగ్ సమయంలో మొదటి నుండి ఈ టార్చర్ మొదలైందని ఉద్యోగ భద్రత నిమిత్తం తట్టుకున్నా గాని మరింతగా వేధింపులు ఎక్కువవడంతో ఈ విషయాన్ని బయట పెడుతున్నట్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు మహిళ ట్రైనింగ్ జర్నలిస్టులు. యాజమాన్యం నుండి కూడా సరైన రెస్పాన్స్ రాకపోవడంతో మహిళ ట్రైనింగ్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో తమ బాధను వెళ్లబుచ్చుతున్నారు. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆ ఛానల్ యాజమాన్యం పై మండిపడుతున్నారు.