సికింద్రాబాద్ మల్కాజ్ గిరి ఎంపీ సీట్లకు పెరుగుతున్న డిమాండ్..

-

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత క్యాడర్ నిరాశలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని గులాబీ దళం భావిస్తుంది.. తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాలకి అభ్యర్థులు దొరక్క పోవడంతో ఆ పార్టీ వేట ప్రారంభించింది.. అయితే సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎంపీ స్థానాలకు మాత్రం పోటీ తీవ్రంగా ఉందని పార్టీలో చేర్చి నడుస్తోంది.. ఆ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తామంటూ అధిష్టానానికి నేతలు విజ్ఞప్తి చేస్తున్నారట.. ఇటీవల టిఆర్ఎస్ నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశానికి 17 పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో పాటు.. ఆశావాహులను సైతం ఆహ్వానించింది..

సికింద్రాబాద్ తో పాటు మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలు తమకు కేటాయించాలంటూ చాలామంది ఆశావాహులు గులాబీ బాస్ ని కోరుతున్నారట..సికింద్రాబాద్ రేసులో తలసాని సాయి యాదవ్, పీజేఆర్ కుమారుడు విష్ణు, మల్కాజ్ గిరి రేస్ లో మల్లారెడ్డి కుమారుడు భద్రా రెడ్ది మరి కొందరు నేతలు పోటా పోటీగా అధిష్టానని కోరుతూ ఉండటంతో ఆ పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు..
గత ఎన్నికల్లో సికింద్రాబాద్ ను బిజెపి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది..
అయితే ఈసారి ఈ రెండు నియోజకవర్గాలకు పోటీ ఉండడానికి ప్రధాన కారణం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తూ ఉండడమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం వరిస్తుందని ధీమాలో ఆశావాహులు ఉన్నారని ప్రగతిభవన్ టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news