ఇండియా టుడే సర్వే: బీజేపీకి గడ్డుకాలమే.. ఓటమి తప్పదు

-

india today survey on upcoming loksabha elections

ఇండియా టుడే.. కార్వీ ఇన్‌సైట్స్ – మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఓ సర్వేను నిర్వహించింది. ప్రీపోల్ సర్వే అనుకోండి. ఆన్ ది స్పాట్ ఎన్నికలు జరిగితే.. ఎవరు గెలుస్తారు అనే దానిపై ఈ సర్వేను నిర్వహించింది. అయితే.. ఇప్పటికి ఇప్పుడు కేంద్రంలో ఎన్నికలు జరిగితే హంగ్ వస్తుందట. కాంగ్రెస్ మాత్రం గతంలో కంటే బాగానే పుంజుకుంటుందట. బీజేపీకి మాత్రం గడ్డుకాలమేనంటూ సర్వే వెల్లడించింది. ఎన్డీయేలో ఉన్న మిత్రపక్షాలు, ఎన్డీయేలోకి వచ్చే కొత్త పార్టీలు కూడా ఎన్డీయేను గెలిపించలేవట.

india today survey on upcoming loksabha elections

సౌత్‌లో తీసుకుంటే… తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి, తమిళనాడులో అన్నాడీఎంకేకు ఎక్కువ లోక్‌సభ సీట్లు వస్తాయని చెప్పింది. సౌత్ పార్టీలన్నీ బీజేపీకి సపోర్టు ఇచ్చినా బీజేపీ గట్టెక్కడం మాత్రం కష్టమేనట. ఇక.. నార్త్ విషయానికి వస్తే.. ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న యూపీలో ఏపార్టీకి అత్యధిక సీట్లు రాకున్నా.. అన్ని పార్టీలకు మాత్రం సమానంగా సీట్లు వస్తాయంటూ సర్వే వెల్లడించింది. ఇక.. నార్త్‌లోని ప్రధాన పార్టీలన్నీ కాంగ్రెస్‌తో కలిస్తే.. వాళ్లదే కేంద్రంలో అధికారం అట. సపోజ్.. మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, మాయావతి, ముఫ్తీలు కాంగ్రెస్‌తో జత కలిస్తే.. వాళ్లే కేంద్రాన్ని ఏలొచ్చట.

ఓటు షేర్ చూస్తే.. ఎన్డీయేకు 35 శాతం, యూపీఏకు 44 శాతం, ఇతరులకు 21 శాతం ఓట్లు రానున్నాయట. బీజేపీకి 219 సీట్లు, కాంగ్రెస్ సారథ్యంలో మమతా బెనర్జీ, అఖిలేష్, మాయావతి లాంటి వాళ్లు కలిస్తే.. 296 సీట్లు వస్తాయట. మ్యాజిక్ ఫిగర్ 272 చేరుకోవాలంటే.. కాంగ్రెస్ అయినా.. బీజేపీ అయినా.. ప్రాంతీయ పార్టీలతో జతకట్టాల్సిందే. ఎవరు ఎక్కువ పార్టీలతో జతకడితే.. వాళ్లదే కేంద్రంలో అధికారం.. అంటూ సర్వే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news