జమ్ము కశ్మీర్ పై కాంగ్రెస్ వైఖరేంటి..? కశ్మీర్ లో జరుగుతున్న తాజా చర్చ ఇదే..

-

జమ్ముకశ్మీర్ లో అధికారం కోసం నువ్వా.. నేనా అన్నట్లు బిజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యుహాలు రచిస్తున్నాయి.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో బిజేపీకి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ ను హస్తగతం చేసుకునేందుకు హస్తం నేతలు పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్నారు. దీంతో.. ఎన్నికలకు ముందే మంచుకొండల్లో మంటలు రేగుతున్నాయి..

జమ్ము కశ్మీర్ లో అత్యంత భయానకమైన పరిస్తితులు ఏర్పడటానికి కాంగ్రెస్సే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది.. కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసే మనస్థత్వమని.. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే ఆ ప్రభావం దేశమంతా పడే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ విధంగానైనా అధికారాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి రాష్టంలో తన విధానాలను అమలు చెయ్యడం ప్రారంభిస్తుందట.. ఈ విషయం అనేక సందర్బాల్లో స్పష్టమైందని యాంటీ కాంగ్రెస్ వాదులు చెబుతున్నారు..

కాంగ్రెస్ పార్టీ జమ్ముకశ్మర్ లో గెలిస్తే.. ప్రాంతాలు మరియు వర్గాలపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తుందని.. తన స్వార్దం కోసమే జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే విమర్శించే వారి సంఖ్య పెరుగుతోంది.. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A విధించడం ఒక ఉదాహరణగా వారు చెబుతున్నారు.. బిజేపీ జమ్ముకశ్మీర్ మీద దృష్టి పెట్టకపోతే.. కాంగ్రెస్ తన మనస్థత్వాన్ని అక్కడి రాజకీయం మీద, ప్రజల మీదే రుద్దేదని కొందరు అంటున్నారు.. ఇటీవల మల్లికార్జున ఖర్గే కశ్మీర్ లో పర్యటించి.. ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శమని ప్రచారం జరుగుతోంది..

రాష్టానికి ప్రత్యేక హోదా పేరుతో రాష్టంలోని కొన్ని వర్గాల ఓటు బ్యాంకును దగ్గరకు తీసుకుని.. ఏర్పాటువాదాన్ని పోత్సహించే స్వభావం కాంగ్రెస్ అని ప్రచారం జరుగుతోంది.. కొద్ది రోజుల్లో జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ చేష్టలపై యాంటీ కాంగ్రెస్ వాదులు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టికరిపించేందుకు బిజేపీ అనేక వ్యూహాలను అమలు చేస్తుంది.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో బిజేపీ చాలా కాన్పిడెంట్ గా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news