తాజాగా 39 ఏళ్లలోకి ప్రవేశించిన తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పు డు అదే తెలుగువారి నుంచి విమర్శలకు గురి అవుతుండడం గమనార్హం. గతంలో తెలుగు జాతి పార్టీగా, తెలుగు వారి పార్టీగా గుర్తింపు పొంది.. ఘనత వహించిన ఈ పార్టీని తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు పేద ప్రజల పార్టీగా అభివర్ణించారు. 38వ వార్షికోత్సవంలో ఆయన చేసిన ప్రసంగంలో పార్టీ యంత్రాంగం అం తా కూడా ప్రస్తుత కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు, ఎక్కడికక్క డ శ్రేణులు కూడా బయటకు రావాలని పిలుపునిచ్చారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. బాబులో కనిపించిన మాటల స్ఫూర్తి.. నేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. కరోనా కు ముందు తర్వాత కూడా టీడీపీ నాయకుల్లో ఎక్కడా కూడా మార్పు కనిపించడం లేదు. గతంలో పార్టీ కి దూరంగా ఇంటికే పరిమితమయ్యారు. పార్టీలో తమకు గుర్తింపు లేదని కొందరు, పార్టీ టికెట్ లభిం చలేదని మరికొందరు ఇలా ఎవరికివారు.. గిరి గీసుకుని బరిలోనే ఉండిపోయారు. అదేసమయంలో పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో మరింత నిర్భంధం పెరిగిన నేపథ్యం లో తమ్ముళ్లు ఇంటికే పరిమితమయ్యారు.
వాస్తవానికి చంద్రబాబు సూచనల మేరకు లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. విరామ సమయంలో తమ్ముళ్లు బ యటకు వచ్చి.. ప్రజలకు ఏదో ఒక రూపంలో సాయం చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. మాస్కుల పంపిణీ లేదా శానిటైజర్ల పంపిణీ, లేదా పేదలకు నిత్యవాసరాల పంపిణీ ఇలా ఏదో ఒక రూపంలో అందిం చాలని సూచిస్తున్నారు. కానీ, తమ్ముళ్లు ఎవరూ కూడాబయటకురావడం లేదు.
అంతేకాదు ఒకరిద్దరు స్పందిస్తూ.. పార్టీ తరఫున ఇచ్చే విరాళాలను నేరుగా సీఎంల ఖాతాల్లో జమ చేశారని, అలా కాకుండా అదేదో పార్టీనే కొనిస్తే.. తాము పంచిపెడతాం కదా? కానీ, మీరిచ్చిన(బాబు) పిలుపుతో మా చేతి చమురు ఎక్కడ వదిలించుకుంటాం! అని నిష్టూరంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి ఈ కీలక సమయంలో నూ బాబు వ్యూహం బెడిసి కొట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.