అక్క‌డ‌ వైసీపీని రిపేర్ చేయాలి… కార్య‌క‌ర్త‌ల నినాదం ఇదే…!

-

రాష్ట్రం అంతా ఒక దారి శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మ‌రో దారి అన్న‌ట్టుగా ఉం ది వైసీపీ ప‌రిస్తితి. రాష్ట్ర వ్యాప్తంగా స్తానిక ఎన్నిక‌ల స‌మ‌రంలో వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. మెజారిటీ స్థా నాల్లో పార్టీ దూకుడు పెంచి అన్నిస్థానికాల‌ను త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, దీనికి విరుద్ధంగా టెక్క‌లిలో మాత్రం కీల‌క నాయ‌కులు, బాధ్యులు కూడా ఎవ‌రికి వారే అన్న విదంగా వైసీపీ లో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఎవ‌రికివారే మా మాటే పెత్త‌నం సాగించాల‌నే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో రాజ‌కీయంగా జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే..

వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ల మధ్య సమన్వయం కొరవడింది. స్థానిక ఎన్నికల్లో విభేదాలు వెలుగుచూస్తుండడం కేడర్‌లో కలవరపరుస్తోంది ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వద్ద టెక్కలి నియోజకవర్గ వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు పంచాయతీ పెట్టారు. కానీ పరిష్కారమార్గం దొరకలేదు.

పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ పేడాడ తిలక్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఆ పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలు సైతం ఎవరికివారు వేర్వేరుగా నిర్ణయించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ తన నివాసంలో ఓ సమావేశం ఏర్పాటుచేస్తే.. అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ తిలక్‌ సాయంత్రం అంబేద్కర్‌ భవన్‌లో మరో సమావేశం నిర్వహించారు. దీంతో ఇద్దరి మధ్య కేడర్‌ నలిగిపోతోంది. ఇక‌, జిల్లా అధ్య‌క్షురాలిగా కృపా రాణి వీరిని స‌మ‌న్వ‌యం చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు.

ఆమె ఎక్క‌డా ఎలాంటి ప్ర‌య త్నం చేయ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా దువ్వాడ కు ఆమెకు మ‌ధ్య తీవ్ర విభేదాలు సాగుతున్నాయి. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు కృపారాణి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసుకున్నారు. అయితే, అవి సాగ‌లేదు. దీనికి దువ్వాడ రాజ‌కీయ‌మే కార‌ణ‌మ‌నే భావ‌న కిల్లి వ‌ర్గంలో ఉంది. ఇలా.. కీల‌క‌మైన ముగ్గురు నాయ‌కులు ఇలా ఒక‌రిపై ఒక‌రు గుస్సాగా ఉండ‌డంతో టెక్క‌లిని రిపేర్ చేయాలంటూ.. దిగువ శ్రేణి నాయ‌క‌త్వం పిలుపు నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news