అద్బుత రాజధానిగా అమరావతి.. సాధ్యమవుతుందా..?

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంలో కదలికలు వచ్చాయి.. గత ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ది అవసరమని భావించిన అప్పటి సీఎం జగన్.. మూడు రాజదానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు.. విశాఖతో పాటు.. కర్నూల్ ను కూడా అభివృద్ది చేసేందుకు సిద్దమయ్యారు.. అయితే 2024లో వైసీపీ పరాజయం పాలవ్వడంతో అమరావతి తెరమీదకు వచ్చింది.. దీన్ని ఏడాదిన్నర లోపు పూర్తి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది.. అందులో భాగంగా గతంలో ఈ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించిన మంత్రి నారాయణకు మరోసారి ఈ బాధ్యతలను చంద్రబాబునాయుడు అప్పగించారు..

అమరావతి పునర్ నిర్బాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.. ఐదేళ్ల క్రితం నిర్మించిన భవనాలను నాణ్యతను పరిశీలించి.. నివేదిక ఇవ్వాలంటూ ఓ టెక్నికల్ టీమ్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది.. ఆ కమిటీ గ్రౌండ్ లెవల్ లో పర్యటించి.. భవనాల నాణ్యతతో పాటు.. చేపట్టాల్సిన భవనాల వివరాలను రూపొందిస్తోంది.. ఇదే సమయంలో 58 వేల ఎకరాల్లో ఉన్న అమరావతి భూములు మొత్తం చెట్లు, పొదలతో నిండిపోయింది.. దీంతో అక్కడ ఉన్న తుమ్మ చెట్లను తొలగించేందుకు ఓ ప్రయివేట్ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్ట్ అప్పగించింది.. 37 కోట్ల రూపాయల వ్యయంతో 30రోజుల్లో కంప చెట్లను తొలగించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. నెల రోజుల్లోనే జంగిల్ క్లియరెన్స్ అయ్యేలా సీఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు..

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందట.. రాజదాని లేని రాష్టంగా ఏపీ ఉందని.. ఆ మచ్చ పోగొట్టుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీనేతలు చెబుతున్నారు.. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మెండుగా ఉండటం.. నిర్మాణానికి నిధులు కూడా ఇస్తుండటంతో దీన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.. రాజధానిని పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్ అంతా తమ ప్రభుత్వానికే వస్తుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట.. అందుకోసమే మంత్రి నారాయణను నిర్మాణ పనుల కోసం కేటాయించారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. అడవిని తలపించే అమరావతిని..అద్బుతంగా తీర్చిదిద్దుతామని.. చంద్రబాబు విజన్ ఏంటో దీన్ని ద్వారా స్పష్టమవుతుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news