హోరాహోరీగా నకిరేకల్..చిరుమర్తి మళ్ళీ గెలుస్తారా?

-

ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం…ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. సి‌పి‌ఐ అడ్డా..1962 నుంచి ఇక్కడ సి‌పి‌ఐ హవా నడుస్తుంది. 1957లో మొదట పి‌డి‌ఎఫ్ గెలవగా..ఆ తర్వాత నుంచి సి‌పి‌ఐ గెలుస్తూ వస్తుంది. 1972లో కాంగ్రెస్ ఒకసారి గెలిచింది. అంతే ఇంకా అన్నీ సార్లు సి‌పి‌ఐ గెలిచింది. 2004 వరకు సి‌పి‌ఐ నకిరేకల్ లో 9 సార్లు గెలిచింది. ఇక 2009లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య గెలిచారు.

ఇక తెలంగాణ వచ్చాక సీన్ మారింది..2014 ఎన్నికల్లో ఇక్కడ బి‌ఆర్‌ఎస్ గెలిచింది. బి‌ఆర్‌ఎస్ నుంచి వేముల వీరేశం గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో మళ్ళీ సీన్ మారిపోయింది. కాంగ్రెస్ నుంచి లింగయ్య మళ్ళీ గెలిచారు. అయితే కాంగ్రెస్ కు టి‌డి‌పి, కమ్యూనిస్టుల మద్ధతు ఉండటంతో గెలిచింది. కానీ గెలిచాక లింగయ్య  బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. అక్కడే ఓడిపోయిన వీరేశం ఉన్నారు. దీంతో ఇద్దరు నేతలకు పడటం లేదు.

పైగా లింగయ్యకు పదవి ఉండటంతో వీరేశంకు ప్రాధాన్యత ఉండటం లేదు. ఆయన వర్గం సైలెంట్ గా ఉంది. కానీ లోలోపల రగిలిపోతూ ఉన్నారు. అయితే ఇరు వర్గాలు సీటు కోసం పోటీ పడుతున్నాయి. కానీ సీటు దాదాపు లింగయ్యకే దక్కే అవకాశాలు ఉన్నాయని తేలడంతో వీరేశం ఇంకా బి‌ఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అలాగే కాంగ్రెస్ లో సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే లింగయ్యకు గట్టి పోటీ ఎదురవుతుంది. ఇక్కడ కమ్యూనిస్టుల మద్ధతు కీలకం అవుతుంది. వారు బి‌ఆర్‌ఎస్ వైపు ఉంటే ఆ పార్టీకే లాభం..అలా కాకుండా కాంగ్రెస్ వైపు వస్తే బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పడుతుంది. చూడాలి మరి ఈ సారి లింగయ్య గెలుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news