కేసీఆర్‌ స్వయంగా రైతు కాబట్టే రైతుల గురించి ఆలోచించారు : ఎర్రబెల్లి

-

టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో ఎన్నారై అండ్ గ్రీట్ లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో వున్న మంత్రి ఎర్రబెల్లి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడిన మంత్రి ఎర్రబెల్లి రైతులకు ఉచిత విద్యుత్ అందించే పథకాలలో కూడా ఏమి రాజకీయం ఉందో ప్రతిపక్షాలకు తెలియాలంటూ విమర్శలు గుప్పించారు.

Errabelli VS Revanth: నాకు చదువు రాదు నిజమే.. అది నిరూపిస్తే రాజీనామా  చేస్తా.. | Minister Errabelli Dayakar rao Fire on Revanth Reddy Jangaon  Karimnagar Telangana Suchi

సీఎం కేసీఆర్‌ రైతు ఉన్నతికి రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాల్లో ఏమి రాజకీయం ఉంతో ప్రతిపక్షాలకే తెలియాలన్నారు. రైతు పంట పండించుకోవడానికి ఉచిత కరంటు ఇస్తే అది తప్పా అని ప్రశ్నించారు.
కరెంట్ 3 గంటలు ఇస్తే రైతు బాగుపడుతాడా అనేది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలని హితవు పలికారు. రైతులు అన్ని గమనిస్తున్నారు. సరైన సమయానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఏ రాజకీయం లేకుండా రైతుకు న్యాయం జరగాలన్న తపనతో పథకాలు అమలు చేస్తూన్న నాయకుడు సీఎం కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రైతులు సీఎం కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని చూసుకుంటారని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news