అమిత్ షా నిద్ర పోతున్నాడా?

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు మరియు నిరసనలు అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చేటట్లు చేశాయి. విషయంలోకి వెళితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌లకు వ్యతిరేకంగా గత కొంత కాలం నుండి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. Image result for Amith shah sleeping

కాగా ఇటీవల డోనాల్డ్ ట్రంప్ భారత్ లో అడుగు పెట్టిన తర్వాత రోజు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనలు మరియు ఆందోళనలో ఏకంగా కొంత మంది చనిపోవడం జాతీయ మీడియా లో కలకలం సృష్టించింది. సరిగ్గా ఈ ఘటన జరగక ముందు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ లో భిన్నత్వంలో ఏకత్వం చాలా ఆదర్శనీయంగా ఉంటుందని ప్రసంగించడం జరిగింది.

 

ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పుడు భారత్ పరువు అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయినట్లు అయింది. దీంతో ఈ విషయం మోడీ దాకా వెళ్లడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిద్ర పోతున్నాడా? అంటూ సీరియస్ అయినట్లు సమాచారం. ఇది కావాలని కొన్ని అల్లరి మూకలు భారత్ పరువు ఇంటర్నేషనల్ స్థాయిలో తీయాలని ట్రంప్ పర్యటన సందర్భంగా వేసిన స్కెచ్ అని కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఈ ఘటన ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news