ఇందుగలడు అందులేడను సందేహము వలదు… ఈఎస్ఐ స్కాంలో లోకేష్ పాత్ర!?

-

చంద్రన్న కానుకలు, ఏపీ ఫైబర్ గ్రిడ్ పై ఏపీ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి సూచించిన అంశం మాంచి కాకమీద ఉన్నప్పుడే… మరో సంచలనం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభానికి ముందు ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కామ్ లో ఆరునెలలుగా విచారణ చేస్తున్న ఏసీబీ పక్కా ఆధారాలతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది! శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఉన్న అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఈ స్కాం లో అచ్చెన్నాయుడితో పాటు మరో మంత్రి కీలక భూమిక పోషించారని ఊహాగానాలు వెలువడుతున్న క్రమంలో… ఆ మంత్రి లోకేష్ బాబే అని విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి!

ఈఎస్ఐ కొనుగోళ్ల టెండరింగ్ లో అచ్చెన్నాయుడితోపాటుగా మరో మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమికంగా తేల్చారట ఏసీబీ అధికారులు. ఈ విషయంలో నామినేటెడ్ పనులును ఇచ్చి హవాలా ద్వారా డబ్బులు తరలించారు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో అలా నామినేటెడ్ వర్క్స్ ఇవ్వండి అని చెప్పింది మాజీ మంత్రి లోకేష్ అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోందట! ఈ క్రమంలో అచ్చెన్నను అరెస్ట్ చేసిన ఏసీబీ.. అనంతరం ఆ మాజీ మంత్రి కుటుంబసభ్యులను విచారించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నాటి అధికారులను కూడా విచారించగా.. వారు చాలా విషయాలు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా… అచ్చెన్న ఆదేశాల మేరకు నాడు డీఐఎంఎస్ డైరెక్టర్ రమేష్ కుమార్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ ఈఎస్ఐ స్కాంలో రూ.155 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ పాత్ర కీలకం కాబోతుందని అంటున్నారు. నామినేటెడ్ పనులు ఇవ్వాలనే విషయంలో లోకేష్ మాటే కీలకంగా మారిందని… లోకేష్ మాటకు సాక్ష్యాలు లేకపోయిన పక్షంలో అచ్చెన్న ఫుల్ గా బుక్కయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news