టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ టార్గెట్ కేసీఆరేనా? అందుకే ఐన్యూస్ చానెల్ ను కొన్నారా?

రవి ప్రకాశ్ కు టీవీ9ను కొనడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయి. అన్ని వేల కోట్లు రవి ప్రకాశ్ ఎలా సంపాదించారో కూడా బహిరంగ రహస్యమే. ఆఫ్రికాలో ఆయనకు పెద్ద మొత్తంలో వ్యాపారాలు ఉన్నాయి.

టీవీ9 సీఈవోగా కొన్నేళ్ల పాటు మీడియాను ఏలిన రవి ప్రకాశ్ ప్రస్తుతం టీవీ9 మాజీ సీఈవో అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు మీడియాలో రవి ప్రకాశ్ గురించే చర్చ. ఫోర్జరీ కేసులో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. టీవీ9 సీఈవో పదవి నుంచి కూడా ఆయన్ను తప్పించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు రవి ప్రకాశ్.

అయితే.. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. రవి ప్రకాశ్ కు టీవీ9ను కొనడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయి. అన్ని వేల కోట్లు రవి ప్రకాశ్ ఎలా సంపాదించారో కూడా బహిరంగ రహస్యమే. ఆఫ్రికాలో ఆయనకు పెద్ద మొత్తంలో వ్యాపారాలు ఉన్నాయి. అక్కడే తన పెట్టుబడులను పెడుతుంటారు రవి ప్రకాశ్. తన వ్యాపార సామ్రాజ్యమంతా అక్కడే విస్తరించి ఉంది. ఆఫ్రికాతో పోల్చితే ఇండియాలో తక్కువే. హైదరాబాద్ లో కూడా ఆయనకు పెద్దగా ఆస్తులు లేవు.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీవీ9 డిబేట్లతో రచ్చ రచ్చ చేసింది. తెలంగాణ రాకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. దాంట్లో ముఖ్యపాత్ర పోషించింది రవిప్రకాశే. ఎంత చేసినా.. చివరకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడాన్ని జీర్ణించుకోలేక.. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. టీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన దానిపై టీవీ9 విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై సీరియస్ అయిన సీఎం కేసీఆర్.. అప్పట్లో టీవీ9 తో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ను కూడా తెలంగాణలో బహిష్కరించారు. ఆ తర్వాత చానెళ్లు క్షమాపణలు చెప్పడం… తర్వాత వాటిని తెలంగాణలో పునరుద్ధరించారు.

అయితే.. అప్పటి నుంచి రవి ప్రకాశ్.. తెలంగాణ ప్రభుత్వం మీద, సీఎం కేసీఆర్ మీద కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన చేతిలో ఎలాగూ టీవీ9 లేదు. ఉన్నది మోజో. అది అంతగా జనాల్లోకి వెళ్లలేదు. అందుకే… ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చానెల్ ఐన్యూస్ ను రవి ప్రకాశ్ కొన్నారట. ఐన్యూస్ కు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పాపులారిటీ ఉంది. అందుకే.. ఐన్యూస్ ను అడ్డం పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని కథనాలు సృష్టించి.. తెలంగాణలో అలజడులు సృష్టించాలనేదే రవి ప్రకాశ్ ప్లానట. అందుకే.. ఐన్యూస్ ను కొన్నాడట.

అప్పట్లో సీఎం కేసీఆర్ టీవీ9 ను బహిష్కరించడం.. తాజాగా ఆయన్ను టీవీ9 నుంచి కొత్త యాజమాన్యం వెళ్లగొట్టడం.. వీటన్నింటికి.. ఐన్యూస్ తో సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడట రవి ప్రకాశ్. అందుకే… తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కథనాలు, బురద జల్లే కథనాలు ప్రసారం చేసి తెలంగాణను ప్రశాంతంగా ఉంచకుండా చేయాలనేది రవి ప్రకాశ్ ప్లాన్ గా చెప్పుకుంటున్నారు.

అయితే.. ఐన్యూస్ చానెల్ పేరుతో.. రవి ప్రకాశ్.. పనికిమాలిన కథనాలను ప్రసారం చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారా? తెలంగాణలో ఏం జరుగుతోందనేది తెలంగాణ జనాలకు తెలియదా? రవి ప్రకాశ్… కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నా.. ఆయన చేసేదేమీ లేదు.. తెలంగాణను ప్రశాంతంగా ఉండనీయకుండా.. తెలంగాణలో లేనిపోని అలజడులు సృష్టించాలని చూస్తే… రవి ప్రకాశ్ ను ఆఫ్రికాకు తరిమేస్తారు.. అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.