కేసీఆర్ మారిపోయారా…? ఇక బయటకు వస్తారా…?

-

తెలంగాణ లో సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల తర్వాత ఇప్పటివరకు ప్రజల్లోకి వెళ్లలేదు. వాస్తవానికి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమైన సందర్భం అంటూ ఏమీ లేదు. ఎక్కడో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ బహిరంగ సభలో ఆయన ప్రసంగం చేయడం మినహా పెద్దగా ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు అనే సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న రాజకీయం వేరు ఇప్పటి నుంచి ఉండే రాజకీయం వేరు. అందుకే సీఎం కేసీఆర్ కాస్త ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం త్వరలోనే ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం వెతుకుతున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నేరుగా ప్రజలతో మమేకమయ్యే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి ఏంటి అనే దానిపై సీఎం కేసీఆర్ నేరుగా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా రైతులతో నియోజకవర్గాల వారీగా సీఎం కేసీఆర్ సమావేశం కావచ్చు అని తెలుస్తుంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సీఎం కేసీఆర్ పర్యటన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news