ఏపీ ప్రజలకి బ్రేకింగ్ న్యూస్ : ఈ విషయం లో చంద్రబాబు – జగన్ చేతులు కలుపుతున్నారు ?

-

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొన్నటివరకు రాజధాని అమరావతి చుట్టూ తిరిగాయి. అధికార పార్టీ నేత సీఎం వైయస్ జగన్ తెరపైకి తెచ్చిన 3 రాజధానులు విషయం ఆంధ్ర రాజకీయాలలో అనేక మంటలు రేపాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులకు దీక్షలు చేస్తున్నవారికి అండగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు వారికి మద్దతు తెలపడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర రాజధానికు సంబంధించిన నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం జరిగింది.

దీంతో అమరావతి రాజధాని మంటలు ఒక్కసారిగా రాష్ట్రంలో ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నట్లు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వచ్చిన కియా పరిశ్రమ రాష్ట్రం నుండి వెళ్లి పోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా గగ్గోలు పెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో వచ్చిన ఈ వార్తలపై కియా యాజమాన్యం స్పందించింది. వచ్చిన వార్తలలో వాస్తవం లేదని అన్ని అవాస్తవాలేనని రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తిగా అండగా ఉందని తెలిపింది.

అయితే ఈ రగడ ఎక్కువ అవటంతో కేంద్రం దాకా విషయం వెళ్లడంతో కియా యాజమాన్యం…ఏపీలో పరిశ్రమల పెట్టడంలో  కొంత నిరుత్సాహం చెందుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త విని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మిగతా పరిశ్రమ సంస్థలు కూడా ఆందోళన చెందుతున్నట్లు వార్తలు గట్టిగా రాగా రాష్ట్రంలో పరిశ్రమల విషయంలో అనవసర రాద్ధాంతం చేయకూడదని చంద్రబాబు మరియు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పెట్టుబడుల విషయంలో ఎవరికి అభద్రతాభావం కలిగించకుండా..వివాదాలు సృష్టించకుండా చంద్రబాబు- జగన్ రాజకీయంగా చేతులు కలిపినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version