ఆయన ఆరోగ్యం క్షీణించింది.. వార్తలు మాత్రం దరిద్రంగా వస్తున్నాయి.ఆ సమయంలో నిబ్బరం కోల్పోవద్దు అని చెబుతూ ఆ సీనియర్ నటుడికి జగన్ అండగా నిలిచి ధైర్యం చెప్పారు. వీలున్నంత మేర ఆస్పత్రి ఖర్చులు తమ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఆ విధంగా సీనియర్ నటుడు కైకాలను జగన్ ఆదుకుని మానవతను చాటుకుని అందరి మన్ననలూ అందుకున్న వైనం నిజంగానే అభినందనీయం. గత ఏడాది నవంబర్ లో అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే ఏపీ సీఎం తనవంతు బాధ్యతగా స్పందించి, సహృదయత చాటడంతో ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
జీవితంలో కృతజ్ఞతకు మించిన పదం ఏమీ లేదు. ఉండదు కూడా! చేసిన మేలుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించిన మనుషులు చాలా అరుదు. రాజకీయ నాయకులయినా సినిమావాళ్లయినా ఇలా అరుదుగానే ఉంటారు. కానీ కొందరే చేసిన మేలును గుర్తు చేసుకుని ఆస్పత్రి గోడల నుంచి బయట పడేందుకు తమకు సహకరించి వారిని, మృత్యువు నుంచి బయటపడేందుకు సహకరించిన వారిని గుర్తు పెట్టుకుని ధన్యవాదాలు చెల్లిస్తారు.
వారిని ఈ సమాజం ఇంకొంత ఎక్కువ గౌరవిస్తుంది. ఆ విధంగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆస్పత్రి నుంచే యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వందనాలు చెల్లించారు. కోలుకున్నాక ఆయన చేసిన మొదటి పని ఇది. ఆనందించాలి మనం. డియర్ సర్ గెట్ వెల్ సూన్.
సీనియర్ నటుడు కైకాల సత్య నారాయణ పూర్తిగా కోలుకున్నారు. ఆస్పత్రి పాలయిన ఆయన మరణ గండం నుంచి గట్టెక్కారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి ఖర్చులన్నింటినీ భరించిన ఏపీ సర్కారు చేసిన సాయాన్ని తాను మరువలేనని అన్నారు. అదేవిధంగా తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసి సినీ వర్గాలనూ, అభిమానులనూ ఆనందింపజేశారు. అంతేకాదు పరిపూర్ణ ఆరోగ్యం అందుకున్నాక ఇకపై ఆయన మళ్లీ నటించి మెప్పించాలని కూడా అభిమానుల ఆకాంక్ష.