ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టిన కాజల్..ఫోటోలు వైరల్

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. అయితే.. గతేడాది ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ గౌతమ్‌ కిచ్లూను కాజల్‌ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను ఆచి..తూచి చేస్తుంది. ఇక తాజాగా ప్రెగ్నెన్సీ రావడంతో… పూర్తిగా సినిమాల నుంచి తప్పుకుంది హీరోయిన్ కాజల్‌. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కాజల్‌ భర్త గౌతమ కిచ్లు కాజల్‌ ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి కాజల్‌ దిగి పోస్ట్‌ చేసే ఫోటోలలో తన బేబీ బంప్‌ కనపడుతోంది.

ఇటీవల తన బేబీ బంప్‌ తో కొన్ని ఫోటోలను కూడా షేర్‌ చేసింది ఈ భామ. తాజాగా తను ప్రెగ్నంట్‌ ఎక్సర్‌ సైజ్‌ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది కాజల్. ఆన్‌ లైన్‌ లో ఫిజిక్‌ 57 ఇండియా అనే సంస్థ సాయంతో ప్రెగ్నెంట్‌ ఎక్సర్‌ సైజ ను చేస్తుంది. ఆన్‌ లైన్‌ లో ప్రెగ్నెంట్‌ ఎక్సర్‌ సైజ్‌ నేర్చుకుంటున్న వీడియోను స్క్రీన్‌ షాట్‌ తీసి తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది కాజల్‌. ఫిజిక్‌ 57 ఇండియా సంస్థతో తాను ప్రినటల్‌ జర్నీని ప్రారంభించానని పోస్ట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news