3 రోజుల తరవాత బయటపడ్డ ఊహించని విషయం- జగన్ డిల్లీ టూర్ లో ట్విస్ట్ ఇదే ?

ఇటీవల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి అన్ని విధాలా రెడీగా ఉందని వైసిపి నాయకులు మీడియా ముందు ఢిల్లీ జగన్ పర్యటన సందర్భంగా కామెంట్లు చేయడం జరిగింది. ప్రధాని మోడీ ని మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని వైసీపీ నేతలు మీడియా ముందు తెగ గొప్పలు చెప్పుకొన్నారు. Image result for modi jagan

స్వయంగా ప్రధాని వైఎస్ఆర్సిపి పార్టీ సాయాన్ని కోరినట్లు కూడా పెద్ద పెద్ద డైలాగులు వేశారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టి మూడు రోజులు కావడంతో ఊహించని పరిణామం ఇటీవల బయటపడింది. అదేమిటంటే జగన్ ఢిల్లీ టూర్ లో శాసన మండలి రద్దు నిర్ణయాన్ని ఇక రాష్ట్రానికి చెందిన 11 ప్రతిపాదనలను కేంద్రం ముందుకు తీసుకు వెళ్లడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో శాసన మండలి రద్దు నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పిన వైసీపీ నేతల మాటలు అంతా అబద్ధమని తాజాగా కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే జగన్ ని ఎన్డీఏ లోకి ఆహ్వానించిన సమయంలో నో చెప్పటంతో శాసన మండలి రద్దు నిర్ణయాన్ని సంవత్సరం పాటు బ్లాక్ లో పెట్టాలి అనే ఆలోచనలో బిజెపి పార్టీ పెద్దలు ఉన్నారట. దీంతో జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం సీఆర్డీఏ బిల్లు అటకెక్కినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.