వైకాపా పార్టీ ఎంపీలంతా ఒకలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు తీరు చాలా డిఫరెంట్. చాలా సందర్భాలలో పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంపీ అయ్యాక బహిరంగంగా మీడియా ముందే కామెంట్లు చేయడం జరిగింది. అప్పట్లో వైఎస్ జగన్ ఇంగ్లీష్ మీడియం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంపల్సరి అని ప్రకటించిన సందర్భంలో..తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రఘురామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు అప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి.
అదే తరుణంలో పార్లమెంటులో ఉన్న ఎంపీలకు ప్రత్యేకమైన విందు రఘురామ కృష్ణం రాజు ఏర్పాటు చేయటంతో…వైయస్ జగన్ కి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రంలో గేమ్ ఆడుతున్నారు అన్న వార్తలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన కేటాయింపులు జరగలేదని కనీసం ఒక కొత్త ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని చాలామంది వైసిపి పార్టీ ఎంపీలు మరియు విపక్ష పార్టీలు బహిరంగంగా కామెంట్ చేయడం జరిగింది.
ఇటువంటి తరుణంలో ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయని రఘురామ కృష్ణం రాజు పొగడటం తో వైసిపి పార్టీ నేతలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు ని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.