జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకునే వాళ్ల గురించి ప్రశ్నించడం విషయంలో ఎక్కడా కూడా వెనుకాడరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ని విమర్శించడం లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఏకిపారేస్తుంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విషయంలో ప్రస్తుతం ఏం చేయలేని స్థితిలో ఉన్నట్లు…. అతని విమర్శించాలన్న చాలా ఆలోచిస్తున్నట్లు భయపడుతున్నట్లు జనసేన పార్టీలో మరియు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి.
ఎందుకంటే ఆయన దళితుడని..దీంతో రాపాక వరప్రసాద్ ని విమర్శిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఇందువల్లనే రాపాక వరప్రసాద్ కి పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్లు జనసేన పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్.
పైగా బీజేపీ పార్టీతో చేతులు కలపడంతో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు క్యాడర్ లో కొద్దిగా వ్యతిరేకత రావడంతో…సీఎం జగన్ విధి విధానాలను ఎండగడుతూన్న పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతున్న రాపాక వరప్రసాద్ ని ఏం చేయలేని స్థితిలో ప్రస్తుతం పవన్ ఉన్నట్లు…గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ని కూడా తిట్టుకుంటే తన పొలిటికల్ కెరియర్ కి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.