గత ఎన్నికల మాదిరిగా..ఈ సారి సీట్ల ఎంపిక చేయడం జగన్‌కు అంత ఈజీ కాదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కూడా సీట్ల కోసం పోటీ ఉంది..కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తక్కువ..ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువ. వారిలో పనితీరు బాగోని వారిని పక్కన పెట్టడం కాస్త పెద్ద టాస్క్. అదే సమయంలో టిడిపి సిట్టింగ్ సీట్లలో బలమైన అభ్యర్ధులని ఎంపిక చేయడం కూడా పెద్ద సవాల్. ఇదే క్రమంలో విశాఖ నగరంలో రెండు సీట్ల విషయంలో జగన్‌కు పెద్ద తలనొప్పి ఎదురవుతుంది.
విశాఖ నగరంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు టిడిపి గెలుచుకుంది. అందులో సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి జంప్ చేశారు. ఇక మూడు సీట్లు టిడిపి ఖాతాలో ఉన్నాయి. అయితే సౌత్ లో వాసుపల్లికి వైసీపీ సీటు ఫిక్స్. ఇక్కడ వర్గపోరు ఉంది. దాని వల్ల వైసీపీకి మైనస్ అవుతుంది. అటు నార్త్ లో ఇంచార్జ్ గా ఉన్న కేకే రాజుకు సీటు ఫిక్స్. కానీ ఈస్ట్, వెస్ట్ సీట్లు పెద్ద సవాల్ గా మారాయి. గత ఎన్నికల్లో ఈస్ట్ లో వైసీపీ నుంచి పోటీ అక్రమాని విజయనిర్మల పోటీ చేసి ఓడిపోయారు.
ఈ సారి ఆమెకు సీటు లేనట్లే. అటు వంశీకృష్ణకు సీటు డౌటే. ఇదే క్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈస్ట్ సీటులో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఈయనకు సీటు ఇంకా క్లారిటీ లేదు. అటు మిగతా నేతలు ఎంతవరకు సహకరిస్తారో చెప్పలేం. ఇక వెస్ట్ లో మళ్ల విజయ్ ప్రసాద్ పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు.
ఈ సారి ఆయనకు సీటు డౌటే. దీంతో సీటు ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు. కానీ ఈస్ట్, వెస్ట్ ల్లో టిడిపి ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. వారిని ఓడించడం వైసీపీకి ఈజీ కాదు.