విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఎలా?: జగన్

-

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. నాడు–నేడు, ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. విద్యార్థులకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.

నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేసారు. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని దీనికి సంబంధించిన నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇంకొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినట్లు వివరించారు. అయితే పరీక్షలను రద్దు చేసిన రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పరీక్షలు జరిగితే ప్రతిభ ఉన్న విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని దీని వల్ల వారికి మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయన్నారు. పాస్ మార్కులతో ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేవలం పాస్‌ మార్కులతో ఉత్తీర్ణులు అయిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏంటీ అని జగన్‌ ప్రశ్నించారు.

పరీక్షలను రద్దు చేయడం చాలా సులభమని, పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్న జగన్… పరీక్షల నిర్వహణకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలని కోరారు. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని అన్నారు. కాగా కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షల నిర్వహణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని హై కోర్టు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news