కొత్త చట్టం తో ముందుకొచ్చిన జగన్ .. ఈ స్కెచ్ అన్నిటికంటే పెద్దది ?

-

మొన్నటి వరకు ఎన్నికలు అంటే డబ్బులు మరియు మద్యం ప్రభావం విపరీతంగా ఉండేది. ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ రెండే. ఎలక్షన్ లో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓటు వేసే విధంగా గెలిపించే విధంగా ఓటరు యొక్క ఆలోచనా విధానం ఉండేది. దీంతో ఆ విధంగా గెలిచిన ప్రభుత్వాలు కూడా అదే రీతిలో పని చేసేది. అయితే ఇటువంటి వాతావరణాన్ని మార్చటానికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నడుంబిగించారు.Image result for jaganరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా డబ్బు మరియు మందు పంచడానికి వీల్లేదని కొత్త చట్టాన్ని తీసుకు రావడం జరిగింది. అంతే కాకుండా ఎవరైనా ఏ పార్టీ అయినా పోటీ చేసే నాయకులు పంచిపెడితే దాదాపు మూడేళ్ళ శిక్షతో పాటు జరిమానా విధించే విధంగా జీవో కూడా తీసుకు రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నా నాయకులు ఈ చట్టం యొక్క విధి విధానాలు తెలుసుకొని ఇది అన్నిటికంటే పెద్ద స్కెచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి జగన్ ఈ కొత్త చట్టం తీసుకు వచ్చారని ఆరోపిస్తున్నారు.

 

ఈ చట్టం రాకముందు ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలని అనుకున్నారు. కానీ జగన్ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఇలాంటివి ఇకపై అక్కడ కుదరదు.  ఇందుమూలంగానే జేసి దివాకర్ రెడ్డి మరి కొంతమంది నాయకులు ఇప్పటికే చేతులెత్తేయడం జరిగింది. 

Read more RELATED
Recommended to you

Latest news