తెలంగాణా బిజెపి అద్యక్షుడుగా బండి సంజయ్…!

-

తెలంగాణా బిజెపి అధ్యక్షుడుగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని అధిష్టానం నియమించింది. ఇన్నాళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీ లక్ష్మణ్ ని తప్పించి ఆయన స్థానంలో సంజయ్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీలో అంచెలు అంచెలుగా ఎదిగిన బండి సంజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక యూత్ లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. దీనితోనే సంజయ్ కి ఎంపీ సీటు ఇచ్చారు.

ఇప్పుడు ఆయన ప్రాధాన్యత తెలుసుకుని ఆయన్ను అధ్యక్షుడిగా నియమించింది బిజెపి అధిష్టానం. లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌పై విజయం సాధించారు. గతంలో ఏబీవీపీ, యువమోర్చాలో ఆయన పనిచేశారు. ఆర్ఎస్ఎస్‌తోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గానూ సేవలందించారు. ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి‌గా ఆయనకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. అయినా సరే ఆయన తెలంగాణాలో మాత్రం తన అభిమానులను పెంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news