రాజధానిపై జగన్ తేల్చేయనున్నారా…?

-

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ చర్చ ఏదైనా ఉందంటే అది రాజధాని అమరావతి గురించే. కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి మార్చబోతుందా? లేక అక్కడే కొనసాగిస్తుందా అనే దానిపై పార్టీల్లోనే కాదు ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఈ అనుమానాలని పెంచే విధంగా అధికార పార్టీ నేతలతో పాటు విపక్ష నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారు.

ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు విషయంపై ఆలోచిస్తున్నామని రోజుకో విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ఇంకా గందరగోళానికి గురి చేశారు. ఈయనకు తోడు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని ప్రకటన చేశారు.

అయితే ఎవరెన్ని ప్రకటనలు చేసిన సీఎం జగన్ చెప్పే నిర్ణయమే ఫైనల్ కానుంది. రాజధానిపై సీఎం త్వరలోనే ఓ ప్రకటన చేస్తారని తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది జగన్ ఆలోచన అని స్పష్టం చేశారు. ఇక అవంతి  చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అమరావతి విషయంలో జగన్ ఏదొక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

జగన్ నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు గాని.. దీనిపై ఇంత వివాదం జరిగిన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలి అనుకుంటే వెంటనే ఏదొక నిర్ణయం చెప్పేవారు. ఇంత జరిగేవరకు ఉండేవారు కాదు.  మరోవైపు జగన్ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని మార్చకపోయినప్పటికీ… ప్రాధాన్యత తగ్గించవచ్చనే చర్చ జరుగుతుంది.

ఇదిలా ఉంటే గురువారం జగన్ రాజధానికి సంబంధించిన సీఆర్డీయే అధికారులతో ఆయన సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత జగన్ రాజధానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చూడాలి చివరకు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news