ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీలు చాలామంది పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీని కారణంగా ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం పెరుగుతుందని వైసీపీ నేతలే అంటున్నారు. కొంతమందిని పార్లమెంట్ సమావేశాలకు వెళ్లాలని వైయస్ జగన్ చెప్పినా సరే పార్లమెంట్ సమావేశాలకు అంటూ ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ కి వెళ్లక పోవడం పట్ల ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది.
దీంతో ఎంపీలు పార్లమెంటు వెళ్తున్నారా లేదా అనే దానిపై జగన్ నిఘా పెట్టారని సమాచారం. పార్లమెంట్ కి వెళ్ళిన సరే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమయం వృధా చేస్తున్నారు అనే భావన ఉంది. ఇక బీజేపీ నేతలతో అవసరం లేకపోయినా సరే ఎక్కువగా చర్చలు జరపడం బీజేపీ నేతలతో కలిసి డిన్నర్ లకు వెళ్లడం… స్నేహం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి తమ తమ నియోజకవర్గాలకు నిధుల తెచ్చుకోమని చెప్పినా సరే వాళ్ళు మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు.
కనీసం వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడకపోవడం పట్ల ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం పెరిగిపోతుంది. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి నిధులు కూడా అడగాల్సిన అవసరం ఉంది. కనీసం దీని విషయంలో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు వైసీపీ ఎంపీలు.