రెబ‌ల్ ఎంపీకి మరో షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌.. రియాక్ట్ అయిన ర‌ఘురామ‌!

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్య‌వ‌హారం ఏ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. మొన్నటి వ‌ర‌కు ర‌ఘురామ కేంద్ర మంత్రుల‌ను క‌లిసి సీఎం జగన్ పై అలాగే పార్టీపై ఫిర్యాదులు చేశారు. అయితే దీనిపై జ‌గ‌న్ కూడా సైలెంట్‌గానే షాక్ ఇస్తున్నారు. రీసెంట్ గానే ఢిల్లీకి వెళ్లిన జ‌గ‌న్ ర‌ఘురామ వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప‌క్కాగా పావులు క‌దుపుతున్నారు.

త‌మ ప్ర‌భుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న రఘురామను ఇక క్ష‌మించేది లేదని జగన్ సీరియ‌స్ గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొన్న ఎంపీ భ‌ర‌త్‌కుమార్ లోక్ స‌భ స్పీక‌ర్‌ను క‌లిసి ర‌ఘురామ‌పై అనర్హత వేటు వేయాల‌ని ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు జ‌గ‌న్ మ‌రో షాక్ ఇచ్చారు. అది కూడా సైలెంట్‌గానే చేయించేశారు.

ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ నుంచి తీసేసారు పార్టీ అధిష్టానం తాజాగా వైసీపీ ఎంపీల జాబితాను స‌వ‌రించారు. ఇందులో భాగంగా తిరుపతి నుంచి గెలిచిన గురుమూర్తికి చోటు ఇస్తూ ఆయ‌న పేరును చేర్చారు. అలాగే ఎంపీ రఘురామ పేరును లిస్టు నుంచి తీసేశారు. పార్టీ నుంచి తీసేస్తున్న‌ట్టు ఇన్‌డైరెక్టుగా సంకేతాలు ఇచ్చారు జ‌గ‌న్‌. అయితే దీనిపై రఘురామ ఘాటుగా స్పందించారు. త‌న‌ను పార్టీ నుంచి బహిష్కరించారా? అంటూ జ‌గ‌న్‌ను ప్రశ్నించారు. కానీ త‌న పార్ల‌మెంటు స్థానాన్ని మాత్రం తొల‌గించ‌లేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు.