శ్రీకాళహస్తిలో రాజకీయం రసవత్తరంగా మారింది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును తెలుగుదేశం దక్కించుకొని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి కన్ఫామ్ చేసింది.. దీంతో జనసేన నేతలు మండిపడుతున్నారు.. మిత్రపక్షంగా ఉన్న జనసేన నేతలని కలుపుకొని పోకుండా.. వారిపై సుధీర్ రెడ్డి కయ్యానికి కాలు దిగుతున్నాడని జనసేన నేతలు మండిపడుతున్నారు. జనసేన ఇన్చార్జిగా ఉన్న వినూత ఇంటి వద్ద సుధీర్ రెడ్డి అనుచరులు బాణసంచా కాల్చి ఆమె అనుచరులపై దాడి చేశారట. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాళహస్తి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టింది.
వచ్చే ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఎవరు సుధీర్ రెడ్డికి సహకరించబోరని వినుత వర్గీలు చెబుతున్నారు.. దానికి తోడు మాజీ ఎమ్మెల్యే NCV నాయుడు సైతం తెలుగుదేశం పార్టీ అధిష్టానం పై ఆగ్రహంతో ఉన్నారట.. టిక్కెట్ ఇస్తానని ఆరు నెలల క్రితం చంద్రబాబు తనని పార్టీలో చేర్చుకున్నారని.. చివరి నిమిషంలో టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆయన మండిపడుతున్నారట. సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా సహకరిస్తామని.. కచ్చితంగా ఓడించి తీరుతామని NCV నాయుడు తన అనుచరుల వద్ద చెబుతున్నారట.. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుని సుధీర్ రెడ్డి పై పోటీ చేస్తానని ఆయన శబదం చేస్తున్నారని కాళహస్తి టౌన్ లో చర్చి నడుస్తోంది. సుధీర్ రెడ్డి కి జనసేన తో పాటు టిడిపిలో ఉండే మరో వర్గం కూడా సహాయ నిరాకరణ చేస్తుండటంతో.. ఆయన గెలుపు అసాధ్యం అనే భావన టిడిపి క్యాడర్లో వ్యక్తం అవుతుంది..
ఐదేళ్లపాటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటూ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎంత మన పట్టించుకోవట్లేదు అని వినూత సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధీర్ రెడ్డి గెలిస్తే.. తమపై కేసులు పెట్టి మరింత ఇబ్బందులు పెడతారని వినూత వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది.. దీంతో సుధీర్ రెడ్డి ఓటమికి తామంతా పని చేస్తామని కొందరు నేతలు వినూతకు స్పష్టం చేశారట.. మొత్తంగా శ్రీకాళహస్తి టిడిపిలో అసంతృప్త జ్వాలల్లో రగిలిపోతున్నాయి