విద్యావంతులకే సీఎం జగన్ పెద్ద పీట.. ప్రతిపక్షాలకు మతి పోయేలా ఎంపిక..

-

బాధ్యతాయుతంగా రాజకీయాలు చేయాలనీ నమ్మే సిద్ధాంతం వైయస్ జగన్ ది. మేనిఫెస్టోని భగవద్గీత ఖురాన్ , బైబిల్ గా భావించే ఆయన.. వాటిని అమలు చేసేందుకు అవసరమయ్యే ప్రజా ప్రతినిధులను కూడా విద్యావంతులనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించారు. అందులో విద్యావంతులకి పెద్దపీట వేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 200 మందికి గాను 77 శాతం మంది ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు..

పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు జర్నలిస్టులు, సివిల్ సర్వెంట్లు ఇలా రకరకాల విద్యావంతులకు సీఎం జగన్ తన టీం లో చోటిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులలో 131 మంది గ్రాడ్యుయేషన్ ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు 47 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టర్ కోర్స్ చేసిన వారున్నారు. అలాగే 13 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు, 34 మంది ఇంజనీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఉండగా.. ఒకరు డిఫెన్స్ లో చేసిన వారు, మరొకరు జర్నలిస్ట్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

లోక్సభ విషయానికొస్తే 22 మంది అభ్యర్థులు డిగ్రీ ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. అందులో 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇద్దరు డాక్టర్ చేసిన వారు ఉండగా, నలుగురు డాక్టర్లు ఒక చార్టెడ్ అకౌంట్ ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు..ప్రజా సేవ చేసేవారికి ప్రజల బాగోగులు అర్థం చేసుకునే అవగాహనతో పాటు ఉన్నత విద్యావంతులుగా ఉండాలని సీఎం జగన్ భావించారట. అందుకే అభ్యర్థుల ఎంపికలో విద్యార్హతను ఉద్యోగ అర్హతను ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేశారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news