దాదాపు అన్నీ స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించి..కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే కేసిఆర్ అభ్యర్ధులని ప్రకటించకుండా ఉన్నారు. గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్సాపూర్ సీట్లలో అభ్యర్ధులని ఖరారు చేయలేదు. అయితే వీటిల్లో గోషామహల్ బిజేపి కంచుకోట..అక్కడ బిఆర్‌ఎస్ ప్రభావం తక్కువే. అటు నాంపల్లి ఎంఐఎం కోట..ఇక్కడ కాంగ్రెస్‌కు పట్టు ఉంది. బిఆర్‌ఎస్ మూడో స్థానమే. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్ధులు ఎవరైనా ఫలితాలు పెద్దగా మారే ఛాన్స్ లేవు.
కానీ జనగామ, నర్సాపూర్ బిఆర్‌ఎస్‌కు పట్టున్న సీట్లు. ప్రస్తుతం అక్కడ బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చిలుముల మదన్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరిపై వ్యతిరేకత ఉందనేది సర్వేలు చెబుతున్నాయి. అటు ముత్తిరెడ్డి ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నారో తెలిసిందే. దీంతో జనగామలో ముత్తిరెడ్డిని పక్కన పెట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు ఇస్తారని ప్రచారం వచ్చింది. దాదాపు పల్లా ఫిక్స్ అయిపోయారని తేలింది. కానీ చివరి నిమిషంలో ముత్తిరెడ్డి బిఆర్‌ఎస్ అధిష్టానంతో భేటీ కావడం..సీటు తనకే కావాలని పట్టుబట్టడంతో ఆ సీటు పెండింగ్ లో పడింది.
అయితే ఇప్పటికీ ఆ సీటు తేలలేదు. ముత్తిరెడ్డికి మళ్ళీ ఇస్తారా? లేదా పల్లాకు ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇక నర్సాపూర్ లో మదన్ రెడ్డిని పక్కన పెట్టేసి..కాంగ్రెస్ నుంచి వచ్చిన సునీతా లక్ష్మారెడ్డికి సీటు ఖాయమని తేలింది. కానీ చివరి నిమిషంలో ఈ సీటు పెండింగ్ లో పడింది.
ఇప్పుడు ఆ సీటు ఎవరికి అనేది క్లారిటీ లేదు. ఎవరికి వారు సీటు తమకే అని ధీమాలో ఉన్నారు. అయితే కేసిఆర్ అంతర్గతంగా సర్వేలు నిర్వహించి సీటు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్ సీటు దాదాపు సునీతాకు ఇస్తారనే టాక్ ఉంది. జనగామ ఇంకా తేలలేదు.