ఏపీలో అత్యధిక ఓటర్లు ఉన్న స్థానం ఏది అంటే..2019 ఎన్నికల సమయంలో ఓటర్ల లెక్కల ప్రకారం..చూసుకుంటే చంద్రగిరి టాప్ లో ఉంది. ఇక్కడ దాదాపు 2.70 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో భీమిలి ఉంది..ఇక్కడ 2.64 లక్షల ఓటర్లు ఉన్నారు. అయితే అతి తక్కువ ఓట్ల ఉన్న స్థానాలు నరసాపురం, పెడన..ఈ స్థానాల్లో దాదాపు లక్షా 59 వేల ఓటర్లు ఉన్నారు.
అయితే గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైసీపీనే గెలిచింది. నరసాపురంలో వైసీపీ..జనసేనపై దాదాపు 6 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా, పెడనలో వైసీపీ..టిడిపిపై 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇక ఈ రెండు స్థానాల్లో ఇప్పుడు జనసేనకు బలం ఉంది. ఒకవేళ గత ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే ఈ రెండు చోట్ల వైసీపీ గెలుపు సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. ఇక ఈ సారి ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయి.
పొత్తులో భాగంగా రెండు సీట్లు జనసేన అడుగుతుంది. అయితే గత ఎన్నికల్లో ఎలాగో నరసాపురంలో జనసేనకు రెండో స్థానం వచ్చింది. ఇక్కడ టిడిపి మూడో స్థానంలో నిలిచింది. కాబట్టి ఈ సీటు పొత్తు ఉంటే జనసేనకు దక్కడం ఖాయం. టిడిపి మద్ధతుతో ఈ సారి నరసాపురంలో జనసేన సులువుగా గెలిచే ఛాన్స్ ఉంది. ఒకవేళ పొత్తు లేకపోయినా గెలిచే అవకాశం ఉంది.
ఇక పెడనలో జనసేన కంటే టిడిపికి డబుల్ బలం ఉంది. అయినా సరే ఈ సీటు జనసేన కావాలని అడుగుతుంది. కానీ టిడిపి ఈ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి చెక్ పడటం ఖాయమే. కాకపోతే సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.