రాష్ట్రంలో సమ్మెల పర్వం.. తాజాగా జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

-

రాష్ట్రంలో సమ్మెల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సెకండ్ ఏఎన్ఎంలు తమను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగగా..తాజాగా జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం సమ్మె సైరెన్ మోగించారు.ఆగస్టు 18 నుంచి జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా సమ్మె బాట పడుతున్నట్లు ప్రకటించారు. తమను పర్మినెంట్ చేయాలన్న డిమాండ్తో సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. బల్దియా దక్కా..పర్మినెంట్ పక్కా నినాదంతో ఆగస్టు 18వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేపడతామన్నారు. ఆ తర్వాత సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

GHMC invites public entries to improve sanitation

ఇదిలా ఉంటే.. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలు సమ్మె బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్రత లేదని, ఎలాంటి పరీక్ష లు లేకుండా తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెకండ్‌ ఏఎన్‌ఎంలు గత పది రోజులుగా సమ్మెలో భాగంగా విధులకు హాజ రు కాకుండా వివిధ రూపాల్లో వినూత్న రీతిలో ఆందో ళనలు చేపడుతూ తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news